తెల్లారింది లెగండో....... కొక్కోరోకో
మంచాలింక దిగండో...... కొక్కోరోకో
తెల్లారింది లెగండో కొక్కోరోకో
మంచాలింక దిగండో కొక్కోరోకో
తెల్లారింది లెగండో కొక్కోరోకో
మంచాలింక దిగండో కొక్కోరోకో
పాములాటి రాతిరి పడగదించి పోయింది
భయం లేదు భయం లేదు నిదర ముసుకు తీయండి
చావులాటి చీకటి చూరు దాటి పోయింది
భయం లేదు భయం లేదు చాపలు చుట్టేయండి
ముడుచుకున్న రెక్కలిర్చి పిట్ట చెట్టు విడిచింది
ముడుచుకున్న రెక్కలిర్చి పిట్ట చెట్టు విడిచింది
ముడుచుకున్న రెక్కలిర్చి పిట్ట చెట్టు విడిచింది
మూసుకున్న రెప్పలిరిచి చూపులెగరనియ్యండి
తెల్లారింది లెగండో కొక్కోరోకో
మంచాలింక దిగండో కొక్కోరోకో
చురుకుతగ్గిపోయింది చందురుడి కంటికి
చులకన పోయింది లోకం చీకటికి
కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం
యెనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా చూసే కన్నూ
ముసురుకోదా మైకం మన్ను మిన్ను
కాలం గట్టిన గంతలు తీసి
కాంతుల వెల్లువ గంతులు వేసి
తెల్లారింది లెగండో కొక్కోరోకో
మంచాలింక దిగండో కొక్కోరోకో
ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి యిసిరిందా సూరీడి చూపులబాణం
కాలిబూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా చిక్కని పాపాల చీడ
చెమటబొట్టు చమురుగా సూరిడ్ని వెలిగిద్దాం
వెలుగుచెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయ్యిద్దాం
వేకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తుని ముక్కలు చేసి
తెల్లారింది లెగండో కొక్కోరోకో
మంచాలింక దిగండో కొక్కోరోకో