Tuesday, 11 June 2019

Mella Mellaga



మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే
 మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే 
 కలా - నిజం, ఒకే క్షణం అయోమయం గా వుందే
 చెరో సగం, పంచె విధం, ఇదేమిటో బాగుందే
మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే

నీతో చేరుతూ, ఏదో కొత్తగా మరో నేనులా మారనే పదా రమ్మని, అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే 
 ఎందుకేమో, ముందు లేదే ఈహాయి
 సందడెమో అల్లుతూనే నీవైపోయే
 ప్రతిక్షణం సంతోషమే, నేనెప్పుడు చూడందే
ప్రపంచమే చూసానులే నీలా ఏది లేదంతే 
మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే

మెరిసే లోపలే మనసే,  మురిసే నీవిలా కలిసే
నిముషాలు రోజులై, నిలిచేను చేతిలో
నేనుంట నీడలా ఇలా, నీతోనే అన్నివేళలా, 
 మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే, అల్లరేదో తెచ్చాడే  
మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే 
 ఆశలేవో ఇచ్చాడే
మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు జల్లావే 
మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే



O Cheli Thaara



ఓ... చెలి తారా
నా మనసారా...
మరలా... మరలా ..
మరలా నిను రమ్మని వెలుగే తెమ్మని 
మరోసారి నీతో అంటున్నా

ఓ... అనగా అనగా
కలలాగా నిన్ను అనుకోలేను
జతగా కదిలే కథలాగా
నీతో కలిసుంటాను
నీతో కలిసుంటాను
 
నచ్చి చేరువైనదేదో
ఇట్టే దూరమైనదే
నాతో ఉండి లేనిదేదో
నేడే అర్థమైనదే
ఏదో వెలితి ఏదో శూన్యం
నలిగినది హృదయం
కదలదిక సమయం
ఓ... చెలితారా
 
నువ్వే పక్కనున్న పూటా
పాటే పండు వెన్నెలా
తోడై నువ్వు లేని చోటా
నేనో మూగ కోయిలా
నువ్వే నాలో చలనం
ఎదనూయలలూపే పవనం
నువ్వే లేని విరహం
ప్రతిక్షణమూ నాకో మరణం
రావె చెలియా నీ రాకే కిరణం
ఓ... చెలితారా
నా... చెలితారా