Tuesday, 21 April 2020

O Sye Raa






 
పవిత్రథాత్రి భారతాంబ ముద్దుబిడ్డవౌరా
 
ఉయ్యాలవాడ నారసింహుడా
 
చరిత్రపుటలు విస్మరించ వీలులేనివాడా 
 
రేనాటి సీమ కన్నసూర్యుడా
 
మృత్యువే స్వయానా చిరాయురస్తు అనగా
 
ప్రసూతి గండమే జయించినావురా
 
నింగి శిరస్సు వంచి నమోస్తు నీకు అనగా
 
నవోదయానివై జయించినావురా
 
ఉషస్సు నీకు ఊపిరాయరా
 
యశస్సు నీకు రూపమాయరా
 
 
అహంకరించు ఆంగ్ల దొరలపైనా
 
హుంకరించగలుగు దైర్యమా
 
తలొంచి బ్రతుకు సాటివారిలోన
 
  సాహసాన్ని నింపు శౌర్యమా
 
 శృంఖలాలనే తెంచుకొమ్మని
 
స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని
 
 నినాదం నీవేరా
 
 ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
 
 సముద్రమల్లె మార్చినావురా
 
 ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి
 
 దొరల్ని ధిక్కరించినావురా
 
మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి
 
 పెఠిల్లు మన్నది ప్రజాలి పోరిది
 
 కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని 
 
 దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
 
 
 దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం
 
మనుషులైతే మనం అణిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం
 
ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని ఒదిలి సాగుదాం
 
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని ప్రతి పదం
 
కదనరంగమంతా
 
 కొదమసింగమల్లె
 
 ఆక్రమించి 
 
విక్రమించి 
 
రుముతోందిరా అరివీర సంహారా

 
 

Friday, 3 April 2020

Nuvvu Vastavani



నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా. వేణువు విందామని. నీతో వుందామని. నీ రాధ వేచేనయ్యా రావయ్యా. ఓ.ఓ.ఓ.గిరిధర. మురహర. రాధా మనోహరా.ఆఆ.ఆఆ.ఆఆ. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. క్రిష్ణయ్యా. రావయ్యా. నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా. మమతల దీపాలు వెలిగించాను మమతల దీపాలు వెలిగించాను కుశలము అడగాలని. పదములు కడగాలని. కన్నీటి కెరటాలు తరలించాను. ఓ.ఓ.ఓ.ఓ.ఓ. గిరిధర. మురహర. నా హృదయేశ్వరా నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా. కృష్ణయ్యా. వేణువు విందామని. నీతో వుందామని. నీ రాధ వేచేనయ్యా రావయ్యా.ఓ.కృష్ణయ్యా. నీ పద రేణువునైనా. పెదవుల వేణువునైనా. బ్రతుకే ధన్యమని భావించానూ. బ్రతుకే ధన్యమని భావించానూ... నిన్నే చేరాలని. నీలో కరగాలని. నా మనసే హారతి గా వెలిగించాను ఓ.ఓ.ఓ.ఓ.ఓ. గిరిధర. మురహర. నా హృదయేశ్వరా ఒకసారి దయచేసి దాసిని దయచూడరా. ఒకసారి దయచేసి దాసిని దయచూడరా. కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. కృష్ణయ్యా.ఓ.కృష్ణయ్యా. గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా... గోవింద. గోవింద.గోవింద. గోపాలా...

chinna mata



చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక్క చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట

సందే గాలి వీచి సన్నజాజి పూచి
సందే గాలి వీచి సన్నా జాజి పూచి
జలదరించే చల్లని వేళ

చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట

రాక రాక నీవు రాగ వలపు ఏరువాక
నా వెంట నీవు నీ జంట నేను
రావాలి మా ఇంటి దాకా
రాక రాక నీవు రాగ వలపు ఏరువాక
నా వెంట నీవు నీ జంట నేను
రావాలి మా ఇంటి దాకా

నువ్వు వస్తే నవ్వు లిస్తా
పువ్వులిస్తే పూజ చేస్తా
వస్తే మళ్ళి వస్తే మనసిస్తే చాలు మాట మాట

చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట

కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
నీ పాటలోనే నే మాటనైతే
నా మేను నీ వేణువాయే
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే
నీ పాటలోనే నే మాటనైతే
నా మేను నీ వేణువాయే

అందమంతా ఆరపోసి
మల్లెపూల పానుపేసి
వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు

చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక్క చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట

సందే గాలి వీచి సన్నజాజి పూచి
సందే గాలి వీచి సన్నా జాజి పూచి
జలదరించే చల్లని వేళ

చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక్క చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట






O batasari




ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి... ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి... ఎంతదూరమో ఏది అంతమో ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సొంతం కాదు ఇది ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి... ఎవరు ఎవరికి తోడవుతారో.. ఎప్పుడెందుకు విడిపోతారో... మమతను కాదని వెళతారో.. మనసే చాలని ఉంటారో... ఎవ్వరి పయనం ఎందాకో... అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి... ఎంతదూరమో ఏది అంతమో ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సొంతం కాదు ఇది ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి... కడుపు తీపికి రుజువేముంది.. అంతకు మించిన నిజమేముంది... కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా ఇప్పుడు తప్పును తెలుసుకునీ జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని... జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని... ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి... తెంచుకుంటివి అనుబంధాన్ని.. పెంచుకున్నదొక హృదయం దాన్ని... అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతాన తెచ్చుకునీ తల్లివి కాగలవా తనయుడు కాగలడా.. తల్లివి కాగలవా తనయుడు కాగలడా... ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి... అడ్డదారిలో వచ్చావమ్మా.. అనుకోకుండా కలిశావమ్మా... నెత్తురు పంచి ఇచ్చావు.. నిప్పును నువ్వే మింగావు... ఆడదాని ఐశ్వర్యమేమిటో ఇప్పుడు తెలిసింది.. కథ ముగిసేపోయింది... ఇప్పుడు తెలిసింది.. కథ ముగిసేపోయింది... ఓ బాటసారి ఇది జీవిత రహదారి...

mouname nee basha



మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా