Tuesday, 31 January 2017

Ammadu lets do kummudu



Yo Guys

This is Not a Mass Song

This is The Boss Song

ఎర్ర చొక్కానే నీ కోసం వేశాను
సర్రుమంటు ఫారన్ సెంటే కొట్టాను
గళ్ళ లుంగీనే ట్రెండిగా కట్టాను
కళ్ళ జోడెత్తి నీ కోసం వచ్చాను
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు

ఎర్ర చీరమో ఈ రోజే కొన్నాను
నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను
వాలు జల్లోనా మందారం పెట్టాను
కన్నె వొళ్ళంతా సింగారం చుట్టాను
పిల్లడు లెట్స్ డు కుమ్ముడు

ఇన్స్టాగ్రామ్ ప్రోఫైల్ పిక్చర్ లాగా 
భలే మస్తుందే నీ అందం మల్లెతీగ
డిస్కవరీ చానల్లో చేసింగ్ లాగా
అలా పైపైకి దూకైకు సింహం లాగా
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు

మండే ఎండలో ఐస్ క్రీమ్ బండిలా
కూల్ అండ్ క్యూట్ గా ఉందే అందం

రెండే కళ్లతో ధన్ ధన్ స్టెన్ గన్ లా
చూపుల గుళ్ళతో తీశావ్ ప్రాణం

హాట్ గా గాటుగా ఉండే నీ హిప్పుని
నాటుగా చాటుగా పట్టేయనా

రఫ్ గా టఫ్ గా ఉండే నీ చేతితో
నువ్ తాకితే నేను పట్టేయ్యనా
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు


తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు
శారీ కట్టినా సల్వారి చుట్టినా
అల్లాడిస్తదే నీ ఔట్ లైను

లారీ గుద్దినా ల్యాండ్ మైనే పెట్టినా
నీతో పోల్చితే నంథింగ్ జాను

స్టెప్పులే స్టెప్పులు నీతో వెయ్యాలని
ఇప్పుడే కట్టినా కొత్త ట్యూన్

నిప్పులా ఉన్న నీ ఒళ్ళో రొమాన్స్ కి
లిప్పులో దాచిన రెడ్డ్ వైన్

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు



Neeru Neeru


      

నీరు నీరు రైతు కంట నీరు
చూడనైనా చూడనెవ్వరూ
గుండెలన్నీ బీడు
ఆశలన్నీ మోడు
ఆదరించు నాధుడెవ్వరూ
అన్నదాత గోడు నింగినంటే నేడు
ఆలకించు వారు ఎవ్వరూ /నీరు/

గొంతు ఎండుపోయే
పేగు మండిపోయే
గంగా తల్లి జాడ లేదనీ
నీటి పైన ఆశ నీరు గారిపోయే
రాత మారు దారి లేదనీ
దాహమారుతుందా 
పైరు పండుతుందా
ధారలైనా కంటి నీటితో/నీరు/

నేల తల్లి నేడు అంగిలారిపోయే
మూగబోయే రైతు నాగలి
ఆయువంత చూడు
ఆర్తనాదమాయే
గొంతు కోసుకుంది ఆకలి