నీరు నీరు రైతు కంట నీరు
చూడనైనా చూడనెవ్వరూ
గుండెలన్నీ బీడు
ఆశలన్నీ మోడు
ఆదరించు నాధుడెవ్వరూ
అన్నదాత గోడు నింగినంటే నేడు
ఆలకించు వారు ఎవ్వరూ /నీరు/
గొంతు ఎండుపోయే
పేగు మండిపోయే
గంగా తల్లి జాడ లేదనీ
నీటి పైన ఆశ నీరు గారిపోయే
రాత మారు దారి లేదనీ
దాహమారుతుందా
పైరు పండుతుందా
ధారలైనా కంటి నీటితో/నీరు/
నేల తల్లి నేడు అంగిలారిపోయే
మూగబోయే రైతు నాగలి
ఆయువంత చూడు
ఆర్తనాదమాయే
గొంతు కోసుకుంది ఆకలి
నేల తల్లి నేడు అంగిలారిపోయే
మూగబోయే రైతు నాగలి
ఆయువంత చూడు
ఆర్తనాదమాయే
గొంతు కోసుకుంది ఆకలి
No comments:
Post a Comment