నవ్వుకో పిచ్చి నాయనా నిన్ను ఆపేదెవ్వడు
ఒక నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పుడు
గనకే నవ్వుకో కసితీరా నవ్వుకో
విరగపడి నవ్వుకో పగలపడి నవ్వుకో
చొక్కాకి ఎన్ని చిరుగులో వెక్కేక్కి మరి నవ్వుకో
పంచరై ఉన్న టైరులో గాలి నింపేట్టు నవ్వుకో
అప్పు బాధ అలవాటేగా చిక్కులేం మనకు కొత్త కాదుకదా
పన్నులో లేని నవ్వు పళ్ళు ఇకిలించీ నవ్వూ
ఒక్క పూటైనా నువ్వు సిగ్గుపడకుండా నవ్వూ
నవ్వుకో పిచ్చి నాయనా నిన్ను ఆపే దెవ్వడూ
ఒక నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ిఇప్పడూ
ఈ వెధవ ఫేసుకి ఆ విధవ ఫేసు ఎదురు
ఏమి అనలేం ఈవిడకు నేను బ్రదరు
అన్నయ్యా అన్నయ్యా ... ఏంటమ్మా
వీడే నా కన్నయ్యా
యల్ కే జిలో చేర్చడానికి రేపే ఆఖరి రోజయ్యా
వర్రీ కాకే వెర్రి సిస్టరు
చదివితే కాడా నాలా డ్రైవరూ
వాడికి కొనిస్తా కంప్యూటరూ
అప్పడు కాడా బిలినీయర్
ఇండియాలో జాబే డల్
ఎన్ఆర్ఐ లైవ్ ఎంతో ధ్రిల్
ఫారన్ జాబ్ కి తియ్యాలి డిడీ
అప్లికేషన్కి తౌజెండ్ కొట్టు డాడీ
కమాన్ ఊ..
జేబులు ఖాళి బాబు చూద్దాం ఇంకో జాబు
ఎందుకు ఈ ఫారిన్ జాబు
ఆంధ్రనే సింగపూర్ ను చేస్తాడు మన బాబు చంద్రబాబు
కనకే నవ్వుదాం మనసారా నవ్వుదాం
నవ్వుకో పిచ్చి నాయనా నిన్ను ఆపేదెవ్వడు
ఒక నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పడు
నాన్నా టర్మ్ ఫీజుకి లేటవుతుంది
కట్టకపోతే పరీక్షలో నా పేరే డిలీట్ అవుతుంది
పదే పదే గోల చేయకే బేటి
గుర్తుంది నాకు నా డ్యూటి
రేపటిలోగా చేద్దాంలే ఏదోటి
ఈ పూటకి మాత్రం నవ్వుకోనివే నా స్వీటీ
ఆపరా కొడకా నీ సొల్లు ఏం చేస్తావురా నా కళ్ళు
నా కాటుకి కావాలి పదివేలు ఇస్తే దీవిస్తా నూరేళ్లు
చేయిస్తాలే కంటాపరేషన్ చెయ్యి కాస్తా కోపరేషన్
ఇవాళ నా బర్త్ డే ఫంక్షన్
నవ్వుకునే నాకు పెట్టకు టెస్షన్ తల్లో.
డాడీ మరేమో నాకూ
గుర్తుంది డాటరు నీ మ్యారేజి మేటరూ
వస్తాడు మొగుడు నీకు డాక్టరూ
అందాక నవ్వుకోవే బంగారూ
నా మొగుడు గురించి కాదు నాన్నా
మరి
హ్యాపి బర్త్ డే టు యూ
హ్యాపి బర్తే డే టు యూ
మెనీ హ్యాపి రిటర్న్స్ ఆఫ్ ద డే మైడాడ్
ఆ కన్నీళ్ళు ఏంటి నాన్నా
ఏడుపుకు అలవాటు పడింది ఈ ఫేసూ/
ఎంత నవ్వినా చాల్లేదేమో ప్రాక్టీసు /2
అయినా నవ్వుకో వెక్కేక్కి నవ్వుకో
విరగపడి నవ్వుకో పగలపడి నవ్వుకో
నవ్వుకో పిచ్చి నాయనా నిన్ను ఆపేదెవ్వడు
ఒక నవ్వు నవ్వితే కొత్త ఖర్చేమి రాదే ఇప్పుడు