సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీతా
ఏ తీరం దొరకని ఈ పయనం
ఎంత దూరమో....
ఎంత కాలమో...
ఎలా ఇలా ఆగడం
ఇలా ఎలా సాగటం
సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీతా
నొసటి బొట్టు నిప్పైతే
పసుపుతాడు పామైతే
చేతులారా తన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం
ఒప్పుకొనే దైర్యం లేక ఒడి చేర్చే ఓపిక లేక
చేతులెత్తు దండం పెట్టి
వదిలి పెట్టి వెళిపోతుంటే
ఎంత యాతనో పేద ప్రేమలో
ఎలా ఇలా ఆగడం
ఇలా ఎలా సాగడం
సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీతా
ఇంటి గుట్టు చెడకుండా దాచలేని ఇరుకుతనం
దాచకుంటే వీధిని పడదా ఆపలేని అవమానం
కానరాని కారుచిచ్చులు కడుపులోన రగులుతుండగా
చూడనట్టు తల తిప్పాలా కళ్ళు మూసి గడిపెయ్యాలా
ఎన్ని మంటలో..... పేద గుండెలో
ఎలా ఇలా ఆగడం
ఇలా ఎలా సాగటం
సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీతా
కలలెన్నో కలబోసి కనిపెంచిన సంతానం
నిలువున తన ఆశలకిపుడే తలకొరివే పెడుతుంటే
పూట పూటకి అప్పుల బాధ ముందువెనుక తలపడలేక
దారి చూపవలసిన తనకే ముందు మలుపు కనపడకుంటే
ఎంత చీకటో....
పేద కళ్లలో
ఎలా ఇలా ఆగడం
ఇలా ఎలా సాగటం
సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీతా
No comments:
Post a Comment