Saturday, 4 February 2017

ముత్యాలు వస్తావా





ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారి

చలమయ్యా వస్తాను 
ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయ్యా

నీ జారు పైట ఊరిస్తు ఉంది
నీ  కొంటెం చూపు కొరికేస్తు ఉంది
కన్ను కన్ను ఎప్పుడో కలిసింది

ఎందయ్యా గోల సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా
నిన్ను నిన్ను చూస్తే నామరదా

పర్మినెంటుగాను నిన్ను చేసుకుంటాను
ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను
ఇంటా బయటా పట్టుకుని ఉంటాను

ఏరు దాటి పోయాక తెప్ప తగల ఏస్తేను
ఊరంతా తెలిసాక వదిలిపెట్టి పోతేను
బండకేసి నిను బాదేస్తానయ్యో
రేవులోన నిను ముంచేస్తానయ్యో

ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారి

చలమయ్యా వస్తాను 
ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయ్యా

No comments:

Post a Comment