ఏమిటి ఈ అవతారం
ఎందుకు ఈ సింగారం
పాత రోజులు గుర్తొస్తున్నావి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంత మీ కోసం
పౌడరు తెచ్చెను నీకందం
బాగా వెయ్ వెయ్ వెడు మందం/2/
తట్టెడు పూలు తలను పెట్టుకొని
తయారవితివా చిట్టి వర్ధనం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
వయసులోనా నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుస కాన్పులయి వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నీ అపరాధం
ఎందుకు ఈ వ్యవహారం
దేవకన్య ఇటు దిగివచ్చిందని
మరచి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎప్పుడైనా
చాలును మీ పరిహాసం
ఈ సోగసంతా మీ కోసం
నీళ్ళు కలపని పాలవంటింది
పిండి కలపని వెన్నవంటింది
నికార్సయినది నా మనసు
ఊరు వాడకి ఇది తెలుసు
ఏమిటి ఈ వ్యవహారం
చాలును మీ పరిహాసం
No comments:
Post a Comment