Saturday, 30 September 2017

Amma Amma ne pasivadnamma




అమ్మ అమ్మ నే పసివాడ్నమ్మ 
నువ్వే లేక  వసి వాడానమ్మ 
మాటే లేకుండా నువ్వే మాయం 
కన్నీరవుతోంది ఎదలో గాయం
అయ్యో వెళిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే 
అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట
నే పాడే జోలకు నువ్వు కళ్ళెత్తి చూసావు అంతే చాలంట 
అమ్మ అమ్మ నే పసివాడ్నమ్మ 
నువ్వే లేకుండ వసి వాడానమ్మ


చెరిగింది దీపం కరిగింది రూపం
అమ్మ నాపై ఏమంత కోపం
కొండంత శోకం నేనున్న లోకం
నన్నే చూస్తు నవ్వింది శూన్యం
నాకే ఎందుకు శాపం
జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైన నడి రేయి ముసిరింది
కలవర పెడుతుంది పెను చీకటి
ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయింది
బ్రతికి సుఖమేమిటి
అమ్మ అమ్మ నే పసివాడ్నమ్మ
నువ్వే లేకుందా వసి వాడనమ్మ


విడలేక నిన్ను విడిపోయి ఉన్న
కలిసే ఉన్నా నీ శ్వాసలోనా
మరణాన్ని మరిచి జీవించి ఉన్నా
ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా
నిజమై నే లేకున్న కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగె గడిచేనా
కలతను రానీకు కన్నంచునా
కసిరే శిశిరాన్నే వెలివేసి త్వరలోనా 
చిగురై నిను చేరనా
అమ్మ అమ్మ నే పసివాడ్నమ్మ 
నువ్వే లేక వసివాడానమ్మా
అడుగై నీతోనే నడిచొస్తున్నా
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
అయ్యో వెళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే
అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట
వెన్నంటి చిరుగాలి జన్మంతా జోలాలి...
వినిపిస్తూ ఉంటా


Friday, 22 September 2017

జయసింహా




ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి

నీ ఊహతోనే పులకించి పోయే ఈ మేను నీదోయి
నీ ఊహతోనే పులకించి పోయే ఈ 
నీ కోసమే ఈ అడిఆశలన్నీ
నా ధ్యాస నా ఆశ నీవే సఖా
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి

ఏ నోము ఫలమో ఏ నోటి వరమో నీ ప్రేమ జవరాలా
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో నీ ప్రేమ జవరాలా
మనియేములే ఇక విరితావిలీల
మన ప్రేమ కెదురేది లేదే సఖీ
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ 
కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి.. 

ఊగేములే తుల తూగేములే 
 ఇక తొలి ప్రేమ భోగాలా.. 
ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే 
ఇక తొలి ప్రేమ భోగాలా.. 
మురిపాలతేలే మన జీవితాలు
మురిపాలతేలే మన జీవితాలు 

 దరహాస లీలావిలాసాలులే.. 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ..
ఈనాటి ఈ హాయి..


Thursday, 21 September 2017

Nanu Dayaganava



నను దయగనవా
నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాతా
ఇక శరణము నీవే మాతా
నను దయగనవా నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాతా
ఇక శరణము నీవే మాతా

అపశకునం అయేనమ్మా
ఇపుడే ఆపద పాలాయనో
అపశకునం అయేనమ్మా, ఇపుడే ఆపద పాలాయనో
ఎటు చూచెదవో , ఎటు బ్రోచెదవో
తనయుని భారం నీదే
నను దయగనవా, నా మొర వినవా
మది నమ్మితి నిన్నే మాతా
ఇక శరణం నీవే మాతా

ఆశా దీపం ఆరిపోవునా
చేసిన పూజలు విఫలములౌనా
నీవు వినా ఇక రక్షకులెవరే
కావగ రావా కావగ రావా
ఓ మాతా ఓ మాతా ఓ మాతా






Manoharamuga



మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే... 
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే... 


ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే 
ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే మనకిది మంచిదిలే 

ఆ..మంచిది అయినా కొంచెమైనా వంచన నీదేలే 
ఆ.. అయినా మంచిదిలే... 
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే... 


ఇది మోహన మంత్రమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే 
ఇది మోహన మంత్రమెలే అదంతేలే సరేలే మనకిది మేలేలే 

ఆ..మేలే అయినా మాలిమైనా జాలము నీదేలే 
ఆ..అయినా మేలేలే.. 
మనోహరముగా మధురమధురముగ మనసులు కలిసెనులే 
ఆ..మమతలు వెలెసెనులే...

Shiva Sankari Siva Nandha




ఆ...ఆ...ఆ..ఆఅ.ఆ 
శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివశంకరి
శివానంద లహరి శివశంకరి
శివానంద లహరి శివశంకరి
చంద్ర కళాధరి ఈశ్వరి........
ఆఆ.....................
చంద్ర కళాధరి ఈశ్వరి
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ చూపవా దీనపాలనము సేయవే
శివశంకరి శివానంద లహరి శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివానంద లహరి శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివశంకరి
చంద్ర కళాధరి ఈశ్వరి
రిరిసనిదనిస మపదనిస దనిస దనిస దనిస 
చంద్ర కళాధరి ఈశ్వరీ
నిరి  సరిపమ దా రిగపా రిరి నిసా 
రిమపదా మపనిరి నిసదప
చంద్ర కళాధరి ఈశ్వరి
దనిస మపదనిస సరిమగ రిమపని దనిస
మపనిరి సరినిస దనిప 
 
 మపనిరి  రిసరిగా నని పని పనిమప గమ పని పనిమప గమ గనిసా 
సరిమపనిదానిస సరిమపనిదానిస  సరిమపనిదానిస
చంద్ర కళాధరి ఈశ్వరి
చంద్ర కళాధరి ఈశ్వరి
 ఆఆఆ...ఆఆఆ...
శివశంకరి 
ఆఆ...ఆఆఆ...ఆఅ ఆఅ
శివశంకరి
తోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం త్రితియన దరితోం
దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం తారియాన
దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరి తన దిరిదిరితోం
దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరి దిరి తోం దిరి దిరి దిరి నాదిరి దిరి దిరి తోం
నినినినినిని దనినిదనినిదప పససనిససనిద నిరిరిసరిరిసని
స గ గ రి గ గ ని స స రి రి స రి రి స ని
నిససనిససనిద దనినిదనిని దప
రిరిదదదదనిని రినిదద దగరిరి గగగగరిరిరిని సనిరిరిదదదద
రీరిరీరిరిరి నినిని రీరిరి నినిని గాగగగ నినిని రీరిగరిమా
రిమరి గరిస నిసని పనిప మపమరిగా
సరిసస మపమమ సరిసస సససస సరిసస పనిమప సరిసస సససస మపమమ
పనిసస మపమపనిద మపమపనిద పదపపసనిద పదపసనిద పదపసనిద మమమ
పపప ససస నినిని ససస రిరిరి గరిసని సరిమ ఆఅ ఆఅ 
శివశంకరి 

Koppu Ninda Puvulu



కొప్పు నిండా పువ్వులేమే కోడల కోడల
నీకెవరు ముడిచినారే కోడల కోడల
కొప్పు నిండా పువ్వులేమే కోడల కోడల
నీకెవరు ముడిచినారే కోడల కోడలా

మరే మరే , ఊ చెప్పూ
ఎదురింటి మల్లె చెట్టు మావయ్య మావయ్య
నీళ్ళు పోసి పెంచానయ్యో మావయ్య మావయ్య
ఎదురింటి మల్లె చెట్టు మావయ్య మావయ్య
నీళ్ళు పోసి పెంచానయ్యా మావయ్య మావయ్య

ఆ.. అహా అట్టాగే మరిగైతే
చెంపంతా గాట్లేమే కోడల కోడల
నిన్నెవరు కొరికినారే కోడల కోడల
చెంపంతా గాట్లేమే కోడల కోడల 
నిన్నెవరు కొరికినారే కోడల కోడల

మరే ఊ మరే ఏమిటి చెప్పు
ఎదురింటి రామచిలక మావయ్య  మావయ్య
ముద్దు పెడితే కొరికిందయ్య మావయ్య మావయ్య
ఎదురింటి రామచిలక మావయ్య మావయ్య
ముద్దు పెడితే కొరికిందయ్య మావయ్య మావయ్య









Ayinademo Ayinadhi



ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసీ 
ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసీ
ప్రేమ గానము సాగ గానే, భూమి స్వర్గమే ఐనదీ
భూమి స్వర్గమె ఐనదీ
ఐనదేమో ఐనదీ 
 
ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో 
ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ.... 
ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసి

కులుకులొలికే హోయలు చూసి
వలపు చిలికే లయలు చూసి 
కులుకులొలికే హోయలు చూసి
 వలపు చిలికే లయలు చూసి
తలపు లేవో రేగి నాలో
చాలా కలవరమైనదీ
చాలా కలవరమైనదీ
ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసి

Aasa Yekaasha



ఆశ ఏకాశ నీ నీడను మేడలు కట్టేసా
ఆశ ఏకాశ నీ నీడను మేడలు కట్టేసా

చింతలో రెండు చింతలో నా చెంత కాదు నీ  తంతులూ ఓయ్
చింతలో రెండు చింతలో నా చెంత కాదు నీ తంతులూ

ఓ.ఓ.. 
ఒద్దంటే కాదే ముద్దుల బాలా ప్రేమ పరగణా రాసేసా
ఊ...ఊహు..
ఒద్దంటే కాదే ముద్దుల బాలా ప్రేమ పరగణా రాసేసా

నిన్ను రాణిగా........
నిన్ను రాణిగా చేసేసా చేతులు జోడించి మొక్కేసా...ఆ..ఆ.
ఆశ ఏకాశ నీ నీడను మేడలు కట్టేసా

ఓ.ఓ. ఓ.ఓ..ఓ...ఓ...
 కోసావులేవోయ్ కోతలూ,
 చాలా చూసానులే నీ చేతలూ
కోసావులేవోయ్ కోతలూ,
చాలా చూసానులే నీ చేతలూ
రాజు ఉన్నడూ, రాజు ఉన్నడూ, మంత్రి ఉన్నడూ
 సాగవు సాగవు నీ గంతులు, చింతలూ...


ఆ.. రాజా, మంత్రా, ఎవరు, ఎక్కడ
  థా తరిగిట థా తరిగిట థలాంగుతక థా
రాజు గారు బూజు దూలిపేస్తా
మంత్రి గారి చర్మమొలిచేస్తా
కోటలో పాగా...... కోటలో పాగా వేసేస్తా
 గట్టిగా నీ చేయి పట్టేస్తా ఆశా......
ఆశా ఏకాశా నీ నీడన మేడలు కట్టేసా
చింతలో రెండు చింతలో నా చెంత కాదు నీ తంతులూ






Thursday, 14 September 2017

Aa Naluguru Movie Song lyrics



ఒక్కడై రావడం ఒక్కడై పోవడం

నడుమ ఈ నాటకం విధి లీలా
వెంట ఏ బంధమూ రక్తసంబంధము
తోడుగా రాదుగా తుదివేళా
మరణమనేది ఖాయమనీ
మిగులెను కీర్తి దాయమనీ
నీ బరువూ నీ పరువూ మోసేదీ

ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ   
రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ

భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము
హద్దులే చెరిపెలే మరుభూమి
మూటలలోని మూలధనం
చెయ్యదు నేడు సహగమనం
మనవెంటా కడకంటా నడిచేదీ

ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ
నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా

విలువలే శిలువగా మోసావు
అందరూ సుఖపడే సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేసావు
నలుగురు నేడు పదుగురిగా
పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ

ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ
పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా

నీవు మా గుండెలో నిలిచావూ
ఆత్మయే నిత్యమూ జీవితం సత్యమూ
చేతలే నిలుచురా చిరకాలం
బతికిననాడు బాసటగా
పోయిననాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ

ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ



Matru Devo Bhava



రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయలే...
నీకిది తెలవారని రేయమ్మా...
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోట మాలి నీ తోడూ లేడులే
వాలి పోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
 లోకమెన్నడో చీకటాయలే

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా....
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ..ఆశలకే హారతివై
రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోట మాలి నీ తోడు లేడులే
వాలి పోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.....

అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే.......
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే..
పగిలే ఆకాశము నీవై..... జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీనియవై
రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోట మాలి నీ తోడూ లేడులే
వాలి పోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, 
లోకమెన్నడో చీకటాయలే


Nireekshana




చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే

పూసిందే ఆ పూల మాను నీ దీపంలో
కాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాలకు చేరం తీరందీ నేరం
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే

తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్దం ఇన్నేళ్ళుగ వ్యర్ధం చట్టం దే రాజ్యం
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ పోయావే


Tuesday, 12 September 2017

ఓ పాపా లాలి



మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా

రేగే మూగ తలపె వలపు పంటరా

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా

రేగే మూగ తలపె వలపు పంటరా


వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను

చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను

చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిన పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు

ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు

హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే ..

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా
రేగే మూగ తలపె వలపు పంటరా 
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

Pranamlo Pranamga




ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా
మొన్న కన్న కల నిన్న విన్న కధ
రేపు రాదు కదా జతా
ఇలా ఎలా నిరాశగా దరి దాటుతున్నా ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎలా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా భారంగా దూరంగా వెడుతున్నా
మొన్న కన్న కల నిన్న విన్న కధ
రేపు రాదు కదా జతా
ఇలా ఎలా నిరాశగా దరి దాటుతున్నా ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎలా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా

స్నేహం నాదే, ప్రేమ నాదే ఆ పైన ద్రోహం నాదే
కన్ను నాదే వేలు నాదే కన్నీరు నాదేలే
తప్పంతా నాదే శిక్షంతా నాకే తప్పించుకోలేనే
ఎడారిలో తుఫానునై తడి ఆరుతున్నా తుది చూడకున్నా
ఎదురీదుతున్నా
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైన ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా

ఆట నాదే గెలుపు అనుకొని ఓటమి నాదే
మాట నాదే బదులు నాదే పశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నే నా చేతితోనే ఏమార్చి రాశానే
గతానిపై సమాధినై గతి మారుతున్నా స్ధితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా....
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా
గతానిపై సమాధినై గతి మారుతున్నా స్ధితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా....





Neve neve nenanta





నీవే నీవే నీవే  నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమే ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే  నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం

నా కలలను కన్నది నీవే
నా వెలుతురు దీపం నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించక పోతే బెంగై వెతికేవే
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేకా నేనే లేనంటా

నే గెలిచిన విజయం నీదే 
నే ఓడిన క్షణము నాదే
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ,ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే  నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే... ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే

నీవే నీవే నీవే  నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమే ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే  నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా





chirugali veechene




చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే
గరుకైనా గుండెలో చిరుజల్లు కురిసెనే
తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే, ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళ మేసి చెలరేగి పోయెనే

తుళ్ళుతున్న చిన్ని సెలయేరూ
గుండెలోనా పొంగి పొలమారూ
అల్లుకున్న ఈ బంధమంతా
వెల్లువైనదీ లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే
నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది
నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటు లేరు గతములో
నేడు చెలిమి చెయ్ జాపే వారే బతుకులో
కలిసిన బంధం కరిగిపోదులే
మురళి మోవి విరిమి తావి కలిసిన వేళా
చిరుగాలి వీచెనే , చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెలే
మేఘం 

మనసున వింత ఆకాశం, మెరుపులు చిందే మన కోసం
తారలకే తళుకు బెళుకా , ప్రతి మలుపు ఎవరికెరుకా
విరిసిన ప్రతి పూదోట కోవెల ఒడి చేరేనా
రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది
రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడు తోడు లేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే
గరుకైనా గుండెలో చిరుజల్లు కురిసెనే
తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే, ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళ మేసి చెలరేగి పోయెనే