ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసీ
ప్రేమ గానము సాగ గానే, భూమి స్వర్గమే ఐనదీ
భూమి స్వర్గమె ఐనదీ
ఐనదేమో ఐనదీ
ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో
ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ....
మనసు నీ వశమైనదీ....
ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసి
కులుకులొలికే హోయలు చూసి
వలపు చిలికే లయలు చూసి
కులుకులొలికే హోయలు చూసి
వలపు చిలికే లయలు చూసి
తలపు లేవో రేగి నాలో
చాలా కలవరమైనదీ
చాలా కలవరమైనదీ
ఐనదేమో ఐనదీ ప్రియగానమేదే ప్రేయసి
No comments:
Post a Comment