ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరిగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే
ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసే
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతొ కలవరించెనా
వెనకనే తిరుగుతు చెలి జత విడువదు
దొరికిన వరమది కుదురుగ నిలువదు
ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే
ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశే
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశే
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నెలంటి నీ ఊసుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే
ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరిగెడుతోంది నీకేసే, వినమంటోంది నీ ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే
ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్