Thursday, 12 October 2017

Ekadantaya Vakratundaya



ఏతమేసి తోడిన యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
ఏతమేసి తోడిన యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు

దేవుడి గుడిలోదైనా, పూరి గుడిసెలోదైనా 
గాలి యిసిరి కొడితే ఆ దీపాముండదు ఆ దీపాముండదు
ఏతమేసి తోడిన యేరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు

పలుకుతాడు మెడకేస్తే పాడి ఆవురా
పసుపుతాడు ముడులేస్తే  ఆడదాయిరా
కుడితినీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాది...
కడుపుకోత కోసినా అది మనిషికే జన్మనిస్తది
బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుచుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
ఏతమేసి తోడిన ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు

అందరూ నడిచొచ్చిన త్రోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దెలో ఉన్నా , చెట్టు నీడ తొంగున్నా..
నిదర మొదర పడినాకా , పాడే ఒక్కటే వల్లకాడు ఒక్కటే
కూతనేర్చినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా
ఏతమేసి తోడిన ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా
 గాలి యిసిరి కొడితే ఆ దీపాముండదు
ఏతమేసి తోడిన యేరు ఎండదు
పొగిలి పొగిలి యేడ్చినా పొంత నిండదు






No comments:

Post a Comment