Thursday, 18 June 2020

Nijamaina kalaina




నిజమైన కలయైనా నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే
నిజమైన కలయైనా నిరాశలో ఒకటేల
ఒకటేలే

పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను
పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను
నా నీడే నా తోడై జగమంతా తిరిగేను
నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే 
ఒకటేలే

గులాబినై నీ జడలో మురిసేనే ఆనాడు
గులాబినై నీ జడలో మురిసేనే ఆనాడు 
బికారినై నీ కోసం వెతికేనే ఈనాడు
బికారినై నీ కోసం వెతికేనే ఈనాడు
నిజమైనా కలయైనా నిరశలో ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే 
ఒకటేలే

చెలి చెలి నా మదిలో చితులన్నో రగిలేను
చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను
చెలి లేని నాకేమో విషాదమే మిగిలేను 
చెలి చెలి నాకేమో విషాదమే మిగిలేను
నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే 
ఒకటేలే







 

 

Ee Vela Naalo Enduko Aasalu



ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లోలోన ఏవో విరిసెలే వలపులు
  ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
 లోలోన ఏవో విరిసెలే వలపులు 

  నీలోని ఆశలన్నీ నా కోసమే 
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
  నీలోని ఆశలన్నీ నా కోసమే
 నా పిలుపే నీలో వలపులై విరిసెలే
 
  నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగిపోయే 
 నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
 నీ మాటలో మధువులే పొంగిపోయే 
  నాలోని ఆణువణువు నీదాయెలే
  బ్రతుకంతా నీకే అంకితం చేయనా
  నీలోని ఆశలన్నీ నా కోసమే
 నా పిలిపే నీలో వలపులై విరిసెలే

నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే  
నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే  
ఉయ్యాల జంపాల ఊగేములే
 కలకాలం మనకు ప్రేమయే ప్రాణము
 ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లోలోన ఏవో విరిసెలే వలపులు 

 

Andala O Chilaka Anduko



అందాల ఓ చిలకా అందుకో నా లేఖ  
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
   
అందాల చెలికాడా అందుకో నా లేఖ 
 నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను   

 మిసమిసలాడే వెందుకని 
తళతళలాడే వేమిటని  
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని  
కురుల మోముపై వాలెనేలనో విరులు కురులలో నవ్వెనెందుకో  
అడుగుతడబడే చిలకకేలనో పెదవి వణికెను చెలియకెందుకో 
  అందాల ఓ చిలకా అందుకో నా లేఖ 
 నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా  

 మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి 
 మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి 
 కురుల మోముపై మరులు గొనెనులే 
 విరులు కురులలో సిరులు నింపెలే  
అడుగుతడబడి సిగ్గు బరువుతో పెదవి వణికెలే వలపు పిలుపుతో
  అందాల చెలికాడా అందుకో నా లేఖ  
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను 
   అందాల ఓ చిలకా అందుకో నా లేఖ  
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా   


నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
  ప్రణయ పాఠము వయసు నేర్పులే 
 మధుర మార్గము మనసు చూపులే 
  నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడచిపోవుగా 
  అందాల ఓ చిలకా అందుకో నా లేఖ 
 నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


Pillalu Devudu Challani Vare




  పిల్లలు దేవుడు చల్లని వారే  
కల్లకపటమెరుగని కరుణామయులే  
 పిల్లలు దేవుడు చల్లని వారే
  కల్లకపటమెరుగని కరుణామయులే
  తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
  ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
  తప్పులు మన్నించుటే దేవుని సుగుణం 
  ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
  పిల్లలు దేవుడు చల్లని వారే  
కల్లకపటమెరుగని కరుణామయులే 
   
  పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును  
 పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును  
ఆ పురుటికందు మనసులో దైవముండును  
ఆ పురుటికందు మనసులో దైవముండును  
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే 
  వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే 
  అంత మనిషిలో దేవుడే మాయమగునులే  
 అంత మనిషిలో దేవుడే మాయమగునులే  
పిల్లలు దేవుడు చల్లని వారే  
కల్లకపటమెరుగని కరుణామయులే 
 
   వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును 
  వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును 
  మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును 
  మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును  
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే 
  గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే 
  మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే  
 మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే  
 పిల్లలు దేవుడు చల్లని వారే 
  కల్లకపటమెరుగని కరుణామయులే చరణం 
 
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు  
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు  
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు 
  ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు  
 మాయమర్మమేమి లేని బాలలందరు
  మాయమర్మమేమి లేని బాలలందరు
  ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే  
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే  
పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే
 
 

Lali Jo Lali Jo Uruko Papayi

 
 
 
 లాలి జో లాలి జో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
  లాలి జో లాలి జో ఊరుకో పాపాయి 
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
  తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు
  కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
 ఆలినే కాదంది కాకినే కూడింది
  అంతలో ఏమైంది అడగవే పాపాయి  
పారిపోనీకుండా పట్టుకో నా చేయి  
 
మాయనే నమ్మింది బోయతో పోయింది 
 దెయ్యమే పూనిందో  రాయిలా మారింది  
వెళ్ళే పెడదారిలో  ముళ్ళే పొడిచాకనే 
 తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది 
 కన్నులే విప్పింది  గండమే తప్పింది 
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
  పారిపోనీకుండా పట్టుకో నా చేయి
 
  పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారో 
గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు  
నేరం నాదైనా భారం నీపైన 
 తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా  
తల్లిలా మన్నించు మెల్లగా దండించు 
 కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా  
బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా
 
 

Sunday, 14 June 2020

nee navve naga swarame




నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ కులుకే కలల కనకాంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రావే కలల తార వయసు మీటే ప్రియ సితార ఊహలొలుకు స రి గ మ పలికి
  పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదసికి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ గోదారి తీరం లోని సంధ్య రాగం కుచ్చిల్లమ్మ మనసారా కోరుకున ఒసరైన వచ్చేలమ్మా నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి నవ్వే రువ్వి నా జంటే కట్టాలి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ కులుకే కలల కనకాంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే...
  నీలి నీలి ముంగురుళు గాలి లోన గింగిరులు అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ జాబిల్లి చిన్నబోయి సున్నలాగా మారిపోయి సిగ్గేసి నల్లమబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో నిన్నే చేరి అయి‌నయే పారాణి
  నా నవ్వే నాగ స్వరమే నా నడకే హంస రథమే నా కులుకే కలల కనకాంబరమే... నా ఒడిలో ఒక్క క్షణమే నీ మదిలో స్వర్ణ యుగమే నా వలపే వేయి జన్మల వరమే... కలిసి రానా కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహలొలుకు స రీ గా మా పలికి




Erra Kaluva Puvva



ఎర్ర కలువ పువ్వా ఏద్దామ చలిమంట
ఎవరిచూడని చోట పొగరాని పొదరింట
ఎర్ర కలువ పువ్వా ఏద్దామ చలిమంట
ఎవరిచూడని చోట పొగరాని పొదరింట

రా మరి సాటుకి సందమామ
కౌగిలి విందుకి సందమామ
సై అనే కాముడే సందమామ
ఆశలే తీరని సందమామ
సైరా సరదా గువ్వా పండిచు నా పంట
పదరా మదన జాతర చేద్దాము పడకింట
గాజుల మోతలో సందమామ
మోజులే మోగని సందమామ
తోడుగా సేరుకో సందమామ
ప్రేమనే తోడుకో సందమామ

గిలిగిలి సల్లగాలి తగిలిందే ఓ హంస
సలి సలి సంబరాలు సాగిస్తే హై లెస్సా
కేరింత కెరటాల .........మునగాల
కేరింత కెరటాల వళ్ళంతా మునగాల
ఊపందుకోవాల నీ పొందు కావాల
నీ ఒడిలో తొంగుంట సందమామ
నీ కలలో నేనుంట సందమామ
నా దొర నీవురా సందమామ
ఊహల రాణివే సందమామ
సైరా సరదా గువ్వా పండిచు నా పంట
పదరా మదన జాతర చేద్దాము పడకింట


కులుకులు కుమ్మరించు మురిపాలే తేవాల
తళుకల పూలతీగ సరసాల తేలాల
వయ్యారి అందాలు ......ఒడిలోన
వయ్యారి అందాలు గంధాలు తీయాల
మందార బుగ్గలో మద్దిల్లు మోగాల
ఏడేడు జనమాలు సందమామ
ఎరికేగా ఉంటానే సందమామ
తానుకే నేనిక సందమామ
నా ఎద నీడిక సందమామ
ఎర్ర కలువ పువ్వా ఏద్దామ చలిమంట
ఎవరిచూడని చోట పొగరాని పొదరింట
సైరా సరదా గువ్వా పండిచు నా పంట
పదరా మదన జాతర చేద్దాము పడకింట
గాజుల మోతలో సందమామ
మోజులే మోగని సందమామ
తోడుగా సేరుకో సందమామ
ప్రేమనే తోడుకో సందమామ






Sirulolikinche Chinni Navvule



సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి


నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ
ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు


వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైన

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు
సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు


Jumbare Jujumbare




జుంబారే  జుజుంబారే 
జుంబరాహి జుంబరాహి జుంబారే

రింబారే రిబబరే 
రింబరాహి రింబరాహి రింబారే

హల్లో బుల్లెమ్లా ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ల గుండెల్లో రంపమా

కొత్త స్టెప్పుల్తో చూపిస్త జుంజుమా
మైకేల్ జాక్సన్ కే మతి పోయే భంగిమా

జుంబారే  జుజుంబారే 
జుంబరాహి జుంబరాహి జుంబారాహి

రింబారే రిబబరే 
రింబరాహి రింబరాహి రింబారే

హల్లో బుల్లెమ్లా ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ల గుండెల్లో రంపమా

కొత్త స్టెప్పుల్తో చూపిస్త జుంజుమా
మైకేల్ జాక్సన్ కే మతి పోయే భంగిమా


Front  సైడు ఆ రూపు Back సైడు ఈ షేపు
మెంటలెక్కి పోయిందే నాకూ
ఫాస్ట్ బీట్ నారూటే మూన్ లైట్ నా ఫేటుసెర్చ్ లైట్ నా సైటు నీటు
నీ నడకలోన ఉంది స్నేక్ డాన్సు పీకాక్ డాన్సు
శభాష్ ప్రేమదాసు బ్రేకు డాన్సు నీ ఫోకు డాన్సు

జుంబారే  జుజుంబారే 
జుంబరాహి జుంబరాహి జుంబారే

రింబారే రిబబరే 
రింబరాహి రింబరాహి రింబారే

నువ్వు నేను టూ ఇన్ ఒన్ లవ్ మార్కు ఫైర్  ఇంజిన్
ముద్దులివ్వు వన్ బై వన్ బేబి
రాసలీల రైలింజన్ ట్రాక్ మీద నో టెన్షన్ 
చేరుదాము లవ్ జంక్షన్ డైలీ
నా జట్లు జూలియట్ కోయిలాలో గోల గోలో
అబ్బాయి చూపిలింక దబ్బనాలో అబ్బబ్బనాలో

జుంబారే  జుజుంబారే 
జుంబరాహి జుంబరాహి జుంబారే

రింబారే రిబబరే 
రింబరాహి రింబరాహి రింబారే

హల్లో బుల్లెమ్లా ఎల్లోరా శిల్పమా
కొంటె కుర్రోళ్ల గుండెల్లో రంపమా

జుంబారే  జుజుంబారే 
జుంబరాహి జుంబరాహి జుంబారే

రింబారే రిబబరే 
రింబరాహి రింబరాహి రింబారే