Thursday, 18 June 2020

Andala O Chilaka Anduko



అందాల ఓ చిలకా అందుకో నా లేఖ  
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
   
అందాల చెలికాడా అందుకో నా లేఖ 
 నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను   

 మిసమిసలాడే వెందుకని 
తళతళలాడే వేమిటని  
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని  
కురుల మోముపై వాలెనేలనో విరులు కురులలో నవ్వెనెందుకో  
అడుగుతడబడే చిలకకేలనో పెదవి వణికెను చెలియకెందుకో 
  అందాల ఓ చిలకా అందుకో నా లేఖ 
 నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా  

 మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి 
 మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి 
 కురుల మోముపై మరులు గొనెనులే 
 విరులు కురులలో సిరులు నింపెలే  
అడుగుతడబడి సిగ్గు బరువుతో పెదవి వణికెలే వలపు పిలుపుతో
  అందాల చెలికాడా అందుకో నా లేఖ  
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను 
   అందాల ఓ చిలకా అందుకో నా లేఖ  
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా   


నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
  ప్రణయ పాఠము వయసు నేర్పులే 
 మధుర మార్గము మనసు చూపులే 
  నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడచిపోవుగా 
  అందాల ఓ చిలకా అందుకో నా లేఖ 
 నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


No comments:

Post a Comment