Sunday, 24 December 2017

Nee Bandaram



నీ బండారం పైన పటారం 
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం
నీ బండారం పైన పటారం 
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం

ఊరి వాళ్ళ కారుల్లో జోరుగా ఊరేగలేదా
ఏరు కోరి ఎరువు జరీ చీరలన్నీ కట్టలేదా
ఊరి వాళ్ళ కారుల్లో జోరుగా ఊరేగలేదా
ఏరు కోరి ఎరువు జరీ చీరలన్నీ కట్టలేదా
కల్లబొల్లి దర్జాతో కాలరెత్తి తిరగలేదా
చెల్లినంత కాలం నువ్ జమాయించి వెలగలేదా
నీ బండారం పైన పటారం 
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం

ఉన్న సరుకు తక్కువా, ఊర ఫోజులు ఎక్కువా
అన్నానికి గతి లేదు... వన్నె మీద మక్కువా మక్కువా మక్కువా
బొడ్డున మాణిక్యంతో పుట్టలేదు ఎవ్వడూ
సొమ్ములెవరివైనా నువ్ సోకు చెయ్యక తప్పదూ
నీ బండారం పైన పటారం 
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం

అప్పు చేసి పప్పుకూడు ఆరగింపు లెందుకు
తప్పు లేదు ప్రాప్తి లేక అప్పు కూడా పుట్టదు
అప్పు చేసి పప్పుకూడు ఆరగింపు లెందుకు
తప్పు లేదు ప్రాప్తి లేక అప్పు కూడా పుట్టదు
పేరు గొప్ప ఊరు దిబ్బా నిలువెల్లా బూటకం
వివరిస్తే ఇంతేలే ప్రతి వాడి జాతకం
నీ బండారం పైన పటారం 
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం












Jayammu Nischayammura



జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా
జంకు గొంకు లేక ముందుకు సాగి పొమ్మురా సాగి పొమ్మురా

గాఢాందకారం అలముకున్నా భీతి చెందకు
గాఢాందకారం అలముకున్నా భీతి చెందకు
సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు
నిరాశతోనే జీవితాన్ని కుంగతీయకు కుంగతీయకు
జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా

జంకు గొంకు లేక ముందుకు సాగి పొమ్మురా సాగి పొమ్మురా


పరాభవం కల్గునంటు పారిపోకుమా
పరాభవం కల్గునంటు పారిపోకువోయ్
జయంబు నిన్ను వరించు వరకు పోరి గెల్వవోయ్
స్వతంత్రయోధుడన్న పేరు నిల్వ పెట్టవోయ్
జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా

జంకు గొంకు లేక ముందుకు సాగి పొమ్మురా సాగి పొమ్మురా
జయంబు నిశ్చయంబురా 
జయంబు నిశ్చయంబురా
జయంబు నిశ్చయంబురా













Rambo Aha Rambo




ఎవడండి వీడు రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడ దడలాడిస్తున్నాడే
యమఫోర్స్ లోనా బ్రూస్ లినే  మరిపిస్తున్నాడే
అనిపించుకుంటా హత్యలు చేసి ఈనాడే
ధైర్యంగా దీవించి పంపించు, ఓ డాడీ ఈ వీరుడ్నీ
ఎవడండి వీడు రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడదడలాడిస్తున్నాడే

సైరన్ లా ఆ నోరేంటి, కొంపలు తీసే గోలేంటీ
హత్యంటే పబ్లిక్ ఫంక్షనా  .......   డాడీ
మర్డర్ కాదనిపించేలా, మన చేయి లేదనపించేలా
పని జరగాలి తెలుసా నాన్నా
ఎవడండీ వీడు రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడదడలాడిస్తున్నాడే

చిక్కటి చీకటి సూది వేస్తే నా పని  ఫెయిలే , చక్కటి సైలెన్స్ అది
అంతలో ఎక్కడో వికృతంగా నక్కలు కూసే స్టీరియో సౌండొస్తుంది
రక్తాన్నే పీల్చేసే డాన్సేసే దెయ్యాలొచ్చే సీస్ అదీ
అతి భీకరంగా ఉండే హారర్ ఫిల్మ్ అదీ
అది చూపగానే పిల్లలు హార్టే అవుతుంది

పిల్లిని చూస్తే బేజారే, బల్లిని చూస్తే బెంబేలే
తానుకు చచ్చే మగధీరుడా
పిల్లలా మాటేమోగానీ హారర్ ఫిల్మ్ చూశావో హాల్లోనే హరి అంటావురా
ఎవడండీ రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడదడనాడిస్తున్నాడే

పార్కుకో బీచ్ కో తీసుకెళ్తే బ్రేకులు లేని కారులో పసివాళ్ళనీ
దారిలో ఎక్కడో యాక్సిండెంటై పోయిందంటే దెబ్బతో అవదా పని
ఆ కార్లో నేనుంటా కాబట్టి మనపై డౌటే రాదింకా
మన చేతికేమి మట్టే అంటని ఈ ట్రిక్కు, 
మరి మెచ్చుకోవేం డాడి సూపర్ లాజిక్

అప్పర్ పోర్షన్ వేకేంటు, దానిలొ లేదే బ్రెయినంటూ
నీకెందుకురా ఈ థికింగూ 
తప్పుడు పనులకు ఏజెంట్ ఉన్నాడ్లే మస్తానంటూ వాడికి చెప్తా నా ప్లానింగూ



Friday, 15 December 2017

I Am a Very Good Girl




I’m a very good girl said me all teacher my dear brother

అన్ని మంచి Habits ఉన్నాయంట నాలో విన్నావా మిస్టర్
I’m a very good girl said me all teacher my dear brother
అన్ని మంచి Habits ఉన్నాయంట నాలో విన్నావా మిస్టర్
బ్రష్ చేసుకుంట నేను క్లోజ్ అప్ తో 
నీళ్లోసుకుంట నేను లిరిల్ సోపుతో
బ్రేక్ ఫాస్ట్ చేస్తా నేను బ్రడ్ జాముతో
స్కూలుకెళ్లిపోతా నేను యూనిఫామ్ లో
i’m a good girl i’m a good girl i’m a good girllllllllll


బన్ని వస్తుంది , జాగ్రత్తగుండండీ
ఫన్నీగా చూస్తుంది, ఏదో  చేస్తుంది
రన్ ఎవే  సమ్ హవ్, లేకపోతే డేంజర్
గప్ చుప్ గా దాక్కొండి ఎక్కడైనా

bunny is a bad girl we dont want her విన్నావా మిస్టర్
పాడు పళ్ళ దెయ్యం, దీన్ని చూస్తే భయ్యం damn ur sister
పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా 
మిస్చీఫ్ చేయకుండా ఉండలేదుగా
గిచ్చి ఏడిపించకుండ వెళ్ళిపోదుగా
అందరిని వెక్కిరించి నవ్వుతుందిగా
she’s a bad girl she’s a bad girl she’s a bad girl 
she’s a bad girllllllll


ఏదో గలాటా     ,    తెస్తుంటే ఎట్టా
ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా నీకిది అలవాటా
వద్దంటు ఉన్నా వస్తావే వెంటా నా పరువుంటుందా
ఉన్న ఒక్క చెల్లిని ఇంత చిన్న పిల్లనీ నువ్విలా తిట్టినా కొట్టినా
నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా చక్కని బొమ్మనే ఇవ్వనా
పాపా ఇది నిజం డబ్బు కాదమ్మా.... ఇది నిజం ప్లేనా
ఓకేరేని నైస్ గేమ్ తీసుకొని దీన్నిథాంక్యు చెప్పుకో
ఐ యామ్ నాట్ ఎ నాటి గోల్ తెలుసుకో సన్నీ ఇప్పుడైనా ఒప్పుకో

టన్నుల కొద్ది పెన్సిలన్నీ 
టన్నుల కొద్దీ పెన్సిలన్నీ స్వాహా చేస్తావే
తినవే తల్లీ అంటు ఉన్నా అన్నం తినవేమే

బన్నీ పేరు చెప్పితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే
దాని బ్రదర్ అంటే అంత ముందుగా నన్నే తంతున్నారే
సన్నీ మాట నమ్మకు అన్నీ ఉత్త కోతలు ప్రామిస్ మమ్మీ
చిన్న దాన్ని కనకే అంత కోపం ఒద్దులే ప్లీజ్  ఎక్ష్కూజ్ మీ

నోరు తెరిస్తే డ్రామా దీన్ని బాగా తందామా
ఇది పేరేంట్స్ కి పరీక్ష , ఇది బ్రదర్ కి శిక్షా
దీనికి యాంటిబయోటిక్ లేదా, దీనికి నీరసం రాదా
దీన్తో మాట్లాడను , దీన్తో ఆట్లాడను
ఇదో సైతాన్ , ఇదో తుమా
ఇదో నా బంగారు తల్లీ








Oh Vendi Vennela



ఓ ... వెండి వెన్నెలా .. 
ఓ ... దిగిరా ఇలా .. 
అమ్మ కొంగులో చంటిపాపలా 
మబ్బు చాటునే ఉంటే ఎలా 
పడిపోతాననీ పసి పాదాలకీ పరుగే నేర్పవా 
మదిలో దాగినా మధుభావాలకి వెలుగే చూపవా 
మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెలా 


ఓ .. సుప్రభాతమా .. 
ఓ .. శుభమంత్రమా .. 
మేలుకొమ్మనే ప్రేమ గీతమా 
చేరుకున్ననా తొలి చైత్రమా 
నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగా నది 
ఈ క్షణాలని జత చేరాలని 
అలలౌతున్నది 
వెల్లువలా చేరుకోన వేచి ఉన్న సంద్రమా 


అంత దూరమా స్వర్గమన్నదీ 
చిటికెలో ఇలా మనదైనది 
అందరానిదా స్వప్నమన్నదీ 
అందమైన ఈ నిజమైనది 
చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని 
ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని 
ప్రతి రోజు పండుగల్లె సాగుతోంది జీవితం 


Thursday, 7 December 2017

Muddula Maa Babu



 ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... 
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు... 
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు 
మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్.. 
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 


చల్లగా నిదరోయే బాబు.. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు.. 
చల్లగా నిదరోయే బాబు.. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు... 
ఏమి కలలు కంటున్నాడో తెలుసా...తెలుసా... 
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ... 
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ... 
ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ
... జుజుజుజుజు.. జుజుజుజుజు... జుజుజుజుజు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్.. 
సద్దు చేసారంటె వులికులికి పడతాడు.. 


ఓ..ఓ..ఓ..ఓ.. 
దేవుడే నా ఎదురుగ నిలబడితే...ఏమి కావాలి తల్లీ..అని అడిగితే... 
దేవుడే నా ఎదురుగ నిలబడితే...ఏమి కావాలి తల్లీ..అని అడిగితే... 
నేనేమని అంటానో తెలుసా...తెలుసా... 
నీ నీడలో నా వాడు పెరగాలనీ... 
నీ నీడలో నా వాడు పెరగాలనీ... 
పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని
...జుజుజుజుజు.. జుజుజుజుజు... జుజుజుజుజు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు 
సద్దు చేశారంటే వులికులికి పడతాడు
జుజుజుజుజు .... జుజుజుజుజు.....జుజుజుజుజు


Andala pasipapa




అందాల పసిపాప ,  అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి, నేనున్నది నీ కొరకే ,నీకన్నా నాకెవరే
అందాల పసిపాప , అన్నయ్యకు కనుపాప 


ఆ చల్లని జాబిలి వెలుగు , ఆ చక్కని చుక్కల తళుకు 
ఆ చల్లని జాబిలి వెలుగు , ఆ చక్కని చుక్కల తళుకు 
నీ మనుగడలో నిండాలమ్మా .. 
నీ మనుగడలో నిండాలమ్మా  నా కలలన్ని పండాలమ్మా 

అందాల పసిపాప , అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి , నేనున్నది నీ కొరకే , నీకన్నా నాకెవరే
అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప 


మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే 
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే 
తోడై నీడై లాలించునులే 
తోడై నీడై లాలించునులే ,మనకే లోటు రానీయదులే 

అందాల పసిపాప , అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి , నేనున్నది నీ కొరకే , నీకన్నా నాకెవరే
అందాల పసిపాప , అన్నయ్యకు కనుపాప
ల ల లాలి , ల ల లాలి
ల ల లాలి , ల ల లాలి