ఎవడండి వీడు రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడ దడలాడిస్తున్నాడే
యమఫోర్స్ లోనా బ్రూస్ లినే మరిపిస్తున్నాడే
అనిపించుకుంటా హత్యలు చేసి ఈనాడే
ధైర్యంగా దీవించి పంపించు, ఓ డాడీ ఈ వీరుడ్నీ
ఎవడండి వీడు రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడదడలాడిస్తున్నాడే
సైరన్ లా ఆ నోరేంటి, కొంపలు తీసే గోలేంటీ
హత్యంటే పబ్లిక్ ఫంక్షనా ....... డాడీ
మర్డర్ కాదనిపించేలా, మన చేయి లేదనపించేలా
పని జరగాలి తెలుసా నాన్నా
ఎవడండీ వీడు రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడదడలాడిస్తున్నాడే
చిక్కటి చీకటి సూది వేస్తే నా పని ఫెయిలే , చక్కటి సైలెన్స్ అది
అంతలో ఎక్కడో వికృతంగా నక్కలు కూసే స్టీరియో సౌండొస్తుంది
రక్తాన్నే పీల్చేసే డాన్సేసే దెయ్యాలొచ్చే సీస్ అదీ
అతి భీకరంగా ఉండే హారర్ ఫిల్మ్ అదీ
అది చూపగానే పిల్లలు హార్టే అవుతుంది
పిల్లిని చూస్తే బేజారే, బల్లిని చూస్తే బెంబేలే
తానుకు చచ్చే మగధీరుడా
పిల్లలా మాటేమోగానీ హారర్ ఫిల్మ్ చూశావో హాల్లోనే హరి అంటావురా
ఎవడండీ రాబిన్ హుడ్ లా ఉన్నాడే
నవజేమ్స్ బాండ్ లా దడదడనాడిస్తున్నాడే
పార్కుకో బీచ్ కో తీసుకెళ్తే బ్రేకులు లేని కారులో పసివాళ్ళనీ
దారిలో ఎక్కడో యాక్సిండెంటై పోయిందంటే దెబ్బతో అవదా పని
ఆ కార్లో నేనుంటా కాబట్టి మనపై డౌటే రాదింకా
మన చేతికేమి మట్టే అంటని ఈ ట్రిక్కు,
మరి మెచ్చుకోవేం డాడి సూపర్ లాజిక్
అప్పర్ పోర్షన్ వేకేంటు, దానిలొ లేదే బ్రెయినంటూ
నీకెందుకురా ఈ థికింగూ
తప్పుడు పనులకు ఏజెంట్ ఉన్నాడ్లే మస్తానంటూ వాడికి చెప్తా నా ప్లానింగూ
No comments:
Post a Comment