నీ బండారం పైన పటారం
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం
నీ బండారం పైన పటారం
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం
ఊరి వాళ్ళ కారుల్లో జోరుగా ఊరేగలేదా
ఏరు కోరి ఎరువు జరీ చీరలన్నీ కట్టలేదా
ఊరి వాళ్ళ కారుల్లో జోరుగా ఊరేగలేదా
ఏరు కోరి ఎరువు జరీ చీరలన్నీ కట్టలేదా
కల్లబొల్లి దర్జాతో కాలరెత్తి తిరగలేదా
చెల్లినంత కాలం నువ్ జమాయించి వెలగలేదా
నీ బండారం పైన పటారం
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం
ఉన్న సరుకు తక్కువా, ఊర ఫోజులు ఎక్కువా
అన్నానికి గతి లేదు... వన్నె మీద మక్కువా మక్కువా మక్కువా
బొడ్డున మాణిక్యంతో పుట్టలేదు ఎవ్వడూ
సొమ్ములెవరివైనా నువ్ సోకు చెయ్యక తప్పదూ
నీ బండారం పైన పటారం
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం
అప్పు చేసి పప్పుకూడు ఆరగింపు లెందుకు
తప్పు లేదు ప్రాప్తి లేక అప్పు కూడా పుట్టదు
అప్పు చేసి పప్పుకూడు ఆరగింపు లెందుకు
తప్పు లేదు ప్రాప్తి లేక అప్పు కూడా పుట్టదు
పేరు గొప్ప ఊరు దిబ్బా నిలువెల్లా బూటకం
వివరిస్తే ఇంతేలే ప్రతి వాడి జాతకం
నీ బండారం పైన పటారం
నీ బతుకంతా లోన లొటారం
నీ వ్యవహారం ఇంకా ఘోరం
నీ బతుకంతా కాకి బంగారం
No comments:
Post a Comment