Wednesday, 31 January 2018

Bhadram Be Careful




భద్రం బీ కేర్ వుల్ బ్రదర్,  భర్తగా మారకు బ్యాచిలరు
షాది మాటే వద్దు గురు , సొలో బతుకే సో బెటరు
భద్రం బీ కేర్ వుల్ బ్రదరూ, భర్తగా మారకు బ్యాచిలరు
షాది మాటే వద్దు గురు , సొలో బతుకే సో బెటరు

ఆలికి మెళ్లో ముళ్ళేశానని ఆనందించే మగవారు 
ఆ తాడే  తన ఊరతాడన్నది ఆలోచించక చెడతారు
మొగుడయ్యే ముహుర్తమే మగాడు సుఖాల ముగింపు చాఫ్టరు
భద్రం బీ కేర్ వుల్ బ్రదర్,  భర్తగా మారకు బ్యాచిలరూ
షాది మాటే వద్దు గురు , సొలో బతుకే సో బెటరు

వంటకని వైఫ్ ఎందుకురా హోటలే చాలు
వంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళి ఆచారం
జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం

పులిలాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
ఫర్వాలేదని పక్కకి వెళ్తే ఫలారామైపోరా
ఈడీ అమీన్, సద్దాం హుస్సేన్, హిట్లర్ ఎక్ష్సట్రా
ఇంట్లో ఉన్నా పెళ్లాం కన్నా డిక్టేటర్లటరా







Govinda Govinda




గోవిందా గోవిందా... గోవిందా గోవిందా...
నుదిటిరాతలు మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా
స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూ నీడా

గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
అరె బాగు చెయ్ నను గోవిందా... బాగు చెయ్ నను గోవిందా...
జూబ్లిహిల్స్ లో బంగ్లా ఇవ్వు...లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు
హైజాక్ అవ్వని ఫ్లైటొకటివ్వు...వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ

గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా
పై తియ్ నను గోవిందా
గోవిందా... గోవిందా...


పెట్రోలడగని కారు ఇవ్వు...బిల్లు అడగని బారు ఇవ్వు
కోరినంత ఫూడ్డు పెట్టి డబ్బులడగని హోటల్ ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకరు పోస్టో.. రాజ్యసభలో ఎం.పీ సీటో
పట్టుబడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాములా సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు...లాసుకాని షేరులివ్వు
సింగిల్ నంబరు లాటరీలివ్వు
టాక్సులడనగి ఆస్తులివ్వు...
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి ||2||
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయిరా వచ్చీ

గో... గో... గో...
గోవిందా... గోవిందా...
బాగు చేయ్ నను గోవిందా


వందనోట్ల తోటలివ్వు...గోల్డు నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాసు హీరో చాన్సులివ్వు......హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టుడియో ఇవ్వు...స్విస్సు బాంకులో బిలియన్లివ్వు
కోట్లు తెచ్చే కోడుకులనివ్వు... హీరోలయ్యే మనవళ్ళనివ్వు
నన్ను కూడా సీ.ఎం చెయ్యి.. లేకపోతే పీ.ఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోనీ లైఫు నివ్వు

గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా...
బాగు చెయ్ నను గోవిందా
బాగు చెయ్ నను గోవిందా
పైకి తే నను గోవిందా
గోవిందా... గోవిందా...

లక్కుమార్చి నను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏ.సీ చేస్తా...ఎయిత్ వండరు నీ గుడి చేస్తా...
గో గో గో గోవిందా... గోవిందా...

అయ్ బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటి..


Hello Guru Prema Kosam




హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని
అరే... హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ఉంగరాల జుట్టు వాడ్ని ... ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని
చదువుసంధ్య గల్గినోడ్ని ... చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి .. అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నాకన్న నీకున్న తాఖీదు ఏంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
I Love You Darling... Because You Are Charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
Why Not...

హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని
Yeah Yeah


హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

కట్టుకుంటే నిన్నె తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టుపెట్టుకుంటినమ్మో బెట్టుచేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లెతీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లూ
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లూ
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మేనే ప్యార్ కియా ... లుచ్చా కామ్ నహి కియా
అమీతుమీ తేలకుంటే నిను లేవదీస్కుపోతా
Are You Ready?


హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని
అహహా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


Sasivadane Sasivadane




శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
చ్చొచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెతేటి కులుకుసిరి నీదా
అచ్చొచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెతేటి కులుకుసిరి నీదా

నవమధన నవమధన కలపకు కన్నుల మాటా 
శ్వేతాష్వమ్ముల వాహనుడ విడువకు మురిసిన బాటా
అచ్చొచేటి వెన్నెలలో విచ్చంధాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచేటి వెన్నెలలో విచ్చంధాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

మధన మోహిని చూపులోన మాండు రాగమేలా 
మధన మొహిని చూపులోన మాండు రాగమేలా 
పడుచు వాడిని కన్నవీక్షణ పంచదార కాదా 
కల ఇల మేఘమాసం క్షణానికో తోడి రాగం
కల ఇల మేఘమాసం క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో  కరిగే మేఘల కట్టినీయిల్లే 

శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
చ్చొచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెతేటి కులుకుసిరి నీదా
అచ్చొచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెతేటి కులుకుసిరి నీదా

నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల
నీయం వీయం యేదేలైన తనువు నిలువదేల
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేల
ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ ఉరే విడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరిలో జాబిలి  హృదయం జత చేరే


Aakasam Yenatido



ల లా లా లా లా...
లా లా లా ఆ..లా లా

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ


ల లా లా లా లా...
లా లా లా ఆ..లా లా
ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను

ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది


ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది