Wednesday, 31 January 2018

Hello Guru Prema Kosam




హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని
అరే... హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ఉంగరాల జుట్టు వాడ్ని ... ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని
చదువుసంధ్య గల్గినోడ్ని ... చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి .. అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నాకన్న నీకున్న తాఖీదు ఏంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
I Love You Darling... Because You Are Charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
Why Not...

హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని
Yeah Yeah


హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

కట్టుకుంటే నిన్నె తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టుపెట్టుకుంటినమ్మో బెట్టుచేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లెతీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లూ
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లూ
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మేనే ప్యార్ కియా ... లుచ్చా కామ్ నహి కియా
అమీతుమీ తేలకుంటే నిను లేవదీస్కుపోతా
Are You Ready?


హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని
అహహా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


No comments:

Post a Comment