Tuesday, 20 March 2018

Ee Janmame Ruchi





ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా

వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో  నెయ్యికారు కూరలు వెయ్యెరా
అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగా చెయ్యెరా
ఈ జన్మమే 
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
ఈ జన్మమే
రుచి చూడడానికి దొరికెరా
ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా


తాపేశ్వరంలోని మడతకాజా తెలుగులా అది తెగ రుచి
ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహు రుచి
నెల్లూరు చేపను తింటే నెలాళ్ళు నెమరేస్తారు
వేలూరు వేటను తింటే ఏడాది  మరిచిపోరు
వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతారు
కమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటారు
రుచులకే నవరుచులు తెలుపగా
పెదవిపై చిరునగవు నెలపరా
 జన్మమే..
ఈ లోకమే
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా

వైశాకమాసాన ఉడుకులోనా కొబ్బరినే తాగు గడగడా
శ్రావణమాసాన ముసురులోనా కారబూంది తిను కర కరా
వీధుల్లో ఆలు బజ్జీ అహాహా ఎంతో రుచి
గుమ్మంలో గోలి సోడా ఓహోహో ఎంతో రుచి
అంగట్లో పానీ పూరి అబ్బబో ఎంతో రుచి
పొరుగింట్లో పుల్లకూర అన్నిట్లో  ఇంకా రుచి
రుచులతో అభిరుచులు కలుపుతూ 
మనసునే మధువనిగా మలచరా
జన్మమే రుచి చూడడానికి దొరికెరా
దొరికెరా దొరికెరా దొరికెరా










Coffee Dandakam Telugu



అనుదిన్నమ్మును కాఫీయే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ
      కప్పు కాఫీ లబించుటే గొప్ప లక్కూ
అమృతమన్నది హంబక్కు అయ్యలారా... 
జై కాఫీ
                         
విశ్వంతరాలలో ఉన్న బ్రహ్మాండ గోళాలలో
నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికీ
   అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ
    నాల్కతో  నీకు జే జేలు పలికేము నానాటికీ....
        ఎర్లి మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్లైనాయున్ త్రోమకున్
తాగు బెడ్ కాఫీ కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టెస్టిశ్వరీ..

బ్రష్ కాఫీశ్వరీ నెట్స్ కేఫీశ్వరీ జిహ్వకున్ శుద్ది చేకూర్చవే బ్రూకుబాండేశ్వరీ



లోక ప్రాణేశ్వరీ  ప్రాణ దానేశ్వరీ  గంటగంటా
 ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పాణేశ్వరీ... 
స్టీలు ఫిల్టర్ల పల్లెంబులోనున్న రంధ్రాలో నుండి  నీ సారమంత సుతారంగ
జారంగ నోరూరుచూడంగ నాసామి రంగా నిజంగానే చచ్చే విధంగా
కాస్త తాగన్  పునర్జన్మ వచ్చేవిధంగా
ప్రొద్దు పొద్దున్ననే నీ పొందులేకున్న మూడంత పాడయ్యి టైమంత వేస్టయ్యి                            కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్  చేసి
              కాంటాక్ట్సు సర్వమ్ము నాశమ్ము   కావించుకుంటారుగా                
అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకొంటారుగా
         దాచుకొంటారుగ కాచుకొంటారుగ
                  చచ్చినట్టింకా ఇచ్చేంతసేపందరున్  వేచి ఉంటారుగా

 కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి          అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గిలక్కొట్టుచునురుంగు
ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా
                          
గొప్పనిష్టాగరిష్ఠుల్ భరిస్తాలలోలన్  గరిష్టంబుగా
కాఫీ తాగెందుకు ఇష్టంబుగా పోవుగా
               షాపు మూసేయా వాపోవుగా                 
సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ సుభాంగీ ప్రభాంగీ
నమస్తే నమస్తే... నమహా





Aavakaya Mana Andaridi




ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేరా
ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేరా
ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ ఎందుకు పాస్తా ఇంకెదుకులే
ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ ఎందుకు పాస్తా ఇంకెదుకులే
ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేరా

ఇడ్డెన్ల లోకి కొబ్బరి చెట్నీ పెసరట్టులోకి అల్లంరా
ఇడ్డెన్ల లోకి కొబ్బరి చెట్నీ, పెసరట్టులోకి అల్లంరా
దిబ్బరొట్టికి తేనెపానకం , దొరకకపోతే బెల్లమురా
దిబ్బరొట్టికి తేనెపానకం, దొరకకపోతే బెల్లమురా
వేడి పాయసం ఎప్పటికప్పుడే , పులిహోరెప్పుడు మరనాడే
వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మరనాడే
మిర్చిబజ్జి నోరు కాలవలె ,ఆవడ పెరెగున తేలవలె

గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా
గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా
గుమ్మడికాయ పులుసుందంటే ఆకును సైతం నాకుమురా
పనసకాయని కొన్నరోజున పెద్దలు తద్దినం అన్నారు
పనసపొట్టులో  ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు

తిండి గలిగితే కండగలదని గురజాడవారు అన్నారు
అప్పదాసు ఆ మాట పట్టుకొని ముప్పిటలా తెగ తిన్నారు










Chitike



చిటిక మీద చిటిక వేసెరా
నా వేళ్ళు చూడు నడిరోడ్డు లోనా 
చిటిక మీద చిటిక వేసెరా
చిటిక మీద చిటిక వేసెరా
నా వేళ్ళు చూడు నడిరోడ్డు లోనా 
చిటిక మీద చిటిక వేసెరా
అయ్య రండయ్య రండయ్య లేట్ ఇంక వద్దయ్య
ఎక్కడున్నారయ్య ఎప్పుడొస్తారయ్య
చిటిక మీద ,చిటిక మీద 
తమ్ముడు చిటిక మీద చిటిక వేసెరా 
నా వేళ్ళు చూడు నడిరోడ్డు లోనా 
చిటిక మీద చిటిక వేసెరా
అయ్య రండయ్య రండయ్య లేట్ ఇంక వద్దయ్య
ఎక్కడున్నారయ్య ఎప్పుడొస్తారయ్య
చిటిక మీద చిటిక మీద 
తమ్ముడు చిటిక మీద చిటిక వేసెరా 
నా వేళ్ళు చూడు నడిరోడ్డు లోనా 
చిటిక మీద చిటిక వేసెరా
చిటిక మీద చిటిక వేసెరా 
నా వేళ్ళు చూడు నడిరోడ్డు లోనా 
చిటిక మీద చిటిక వేసెరా

ఎగిరి ఎగిరి పైకి ఎగరా
తిరిగి తిరిగి మనము నవ్వగా
చిందేసి చిందేసి ఆడాలి నువ్వింకా
కలిసి కలిసి దూకాలిరా ఇంకా
తగ్గొద్దు తగ్గొద్దు మాట పదును
ఎగసి ఎగసి పైకి కదులు
ఎరుపు ఎరుపు కోపమవరా
ఎంత పడితే అంత లేగరా
చిటిక మీద  ఓ చిటిక వేసెరా 
తమ్ముడూ

వెళ్ళెద్దు అంటునే ఆపేటి వాళ్ళుంటే తరిమిచూడరా
తల పొగరుతో ఎగిరేవాడ్ని తరిమికొట్టరా
ఆకలన్న వాడి ముద్దలాగుతుంటే ఎదురు తిరగరా
నిను తగలగ భయపడేలా తెగువచూపరా
కొడుతు గొడవ పడినా, తిరిగి తిరగబడరా
బలుపు ఎదురుపడితే నలిపి గెలవరా
ఎవడు తగువు పడినా ఎవరి మాట వినకా
తరిమి తరిమి కొడితే తలుపు విరగదా
అరె పోవయ్య పోవయ్య ఏ చోట పోవయ్య
కంటపడ్డారంటే తంటాలు నీకయ్య
అక్కడ ఇక్కడ ఎక్కడో పోవయ్య
ఈ పక్కకొచ్చారో ఇంజురే అవునయ్య
చిటిక మీద  హోయ్ చిటిక మీద 
తమ్ముడు చిటిక మీద చిటిక వేసెరా 
నా వేళ్ళు చూడు నడిరోడ్డు లోనా 
చిటిక మీద చిటిక వేసెరా

విరిచి విరిచి ఇరగ తోముదాం
ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదాం
అధికారమణచి దించేసి పొగరు
తొక్కి పట్టి నరము లాగుదాం
ఏ ఎందుకు పోవాలి పళ్ళూడకొట్టాలి
వీథి వీథి తిప్పి చెప్పుతో కొట్టాలి
మాటైనా ఎత్తితే ఎత్తేసి తన్నాలి
బీదవాడి బాధ వాడింక చూడాలి
విరిచి విరిచి , విరిచి విరిచి
ఇంకా విరిచి విరిచి ఇరగ తోముదాం
అధికారమణచి దించేసి పొగరు
తొక్కి పట్టి నరము లాగుదాం












Monday, 19 March 2018

Yentha Sakkagunnaave



వేరు శనగ కోసం మట్టిని తవ్వితే..
 ఏకంగా తగిలిన లంకె బిందెలాగ
 ఎంత సక్కగున్నావే..లచ్ఛిమి ఎంత సక్కగున్నావే.

చింత చెట్టు ఎక్కి సిగురు కోయబోతే.. 
చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావే..
లచ్ఛిమి ఎంత సక్కగున్నావే..
మల్లెపూల మధ్య ముద్దబంతిలాగ.. ఎంత సక్కగున్నావే..
ముత్తైదువ మెళ్లో.. పసుపు కొమ్ములాగ.. ఎంత సక్కగున్నావే..
చుక్కల చీర కట్టుకున్న యెన్నెలలాగ ఎంత సక్కగున్నావే..
వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. 
ఏకంగా తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే..
లచ్ఛిమి ఎంత సక్కగున్నావే....

రెండు కాళ్ల సినుకువి నువ్వు..గుండె సెర్లో దూకేసినావు
..అలల మూటలిప్పేసినావు ఎంత సక్కంగున్నావె.
.లచ్చిమి..ఎంత సక్కగున్నావె
మబ్బులేని మెరుపువు నువ్వు..నేలమీద నడిచేసినావు..
నన్ను నింగి చేసేసినావు లచ్చిమీ ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
సెరకుముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నావె 
సెరకు గడకే తీపి రుసి తెలిపీసినావె..ఎంత సక్కగున్నావె
తిరునాళ్లలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగ 
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
గాలి పల్లకిలో ఎంకి పాటలాగ, ఎంకిపాటలోని తెలుగు మాటలాగ 
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
కడవ నువ్వు నడుమన బెట్టి, కట్టమీద నడిసొస్తా వుంటే సంద్రం నీ సంకెక్కినట్లు 
ఎంత సక్కగున్నావె..లచ్చిమీ ఎంత సక్కగున్నావె
కట్టెల మోపు తలకెత్తుకుని అడుగులోన అడుగేస్తా వుంటే, అడవి నీకు గొడుగట్టినట్లు 
ఎంత సక్కగున్నావె..లచ్చిమీ ఎంత సక్కగున్నావె
బురదసేనులోన వరి నాటువేస్తా వుంటే ఎంత సక్కగున్నావె 
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్లు
 ఎంత సక్కగున్నావె
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ 
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ 
ఎంత సక్కగున్నావె”




Choosi Chudangane






 చూసి చూడంగానే నచ్చేశావే
అడిగి అడగకుండా వచ్చేశావే
నా మనసులోకి హో అందంగా దూకి

దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె ఎగరేశావే
ఓ చూపు తోటి హో
ఓ నవ్వుతోటి

 తొలిసారిగా
నా లోపల
ఏమైందో
తెలిసేదెలా

నా చిలిపి అల్లరులు
నా చిన్ని సరదాలు 
నీలోనే చూశానులే
నీ వంక చూస్తుంటే 
అద్దంలో నను నేను చూస్తునట్టే ఉందిలే హో

నీ చిత్రాలు ఒకటి చూస్తునే ఉంటే
అహ ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుందే
నువ్ నా కంట పడకుండా
నా వెంట పడకుండా 
ఇన్నాల్లెక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నే ఎన్నెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వకే నేను గెలుపొంది వస్తాను
హామి ఇస్తున్నానులే
ఒకటో ఎక్కం కూడా మరిచేపోయాలాగా
ఒకటే గుర్తొస్తావే
నిను చూడకుండా ఉండగలనా
నా చిలిపి అల్లరులు
నా చిన్ని సరదాలు 
నీలోనే చూశానులే
నీ వంక చూస్తుంటే 

అద్దంలో నను నేను చూస్తునట్టే ఉందిలే హో




Devatha O Devatha



ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కలా 
చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళా 
చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల 
మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా 
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే 
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే 
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే 
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే 


ఓ… నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే 
నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే 
నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే 
అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే 
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే 
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే 
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే 
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే 


ఓ… నీవల్లే కరిగిందీ మనసంతా కను తడిగా 
నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా 
గతజన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగా 
ఇకపై నెనెప్పటికి నీ ఊపిరి గాలల్లే ఉంటాగా 
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే 
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే 
దేవత ఓ దేవత నా మనసునే మార్చావే 
ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే 


Pyar Mein Padipoya



ప్యార్ మే పడిపోయా మై
ఒ మియా తేరి ప్యారే మే పడిపోయా మై
ప్యార్ మేస్ చోడ్ దియా మై
ఓ జాను మే ప్యార్ మేన్ చోడ్ దియా మై

ఖానా పీనా నహి రే బావా కడుపుకే
నిద్ర గిద్ర ఆతి నహి రే కళ్ళకే
జిందగీ హలాల్ అయిందిరో
ప్యార్ మేన్ పడిపోయా మే
ఒ మియా తేరి ప్యారే మే పడిపోయా  మై
ప్యార్ మేస్ చోడ్ దియా మే
ఓ జాను మేరే ప్యార్ మే చోడ్ దియా మై

దిల్ దిల్ దడకే బుగ్గలు చూస్తే
జిల్ జిల్ ఆడే నడుముని చూస్తే
దిల్ మేరా లాగేతాందిరే
ఓ పిల్లా తేరి ప్వార్ కోసం దేకేస్తున్నానే
దిల్ దిల్ దడకే బుగ్గలు చూస్తే
జిల్ జిల్ ఆడే నడుముని చూస్తే
దిల్ మేరా లాగేతాందిరే
ఓ పిల్లా తేరి ప్వార్ కోసం దేకేస్తున్నానే

దేకుడు గీకుడు నాక్కోజి
ప్యార్ మాత్రం కర్లోజి
మేస్ బి నీతో  ఇష్క్ చేస్తి హూ
ప్యార్ మే పడిపోయా మై
ఒ మియా తేరి ప్యారే మే పడిపోయా మై
ప్యార్ మే పడిపోయా మై
ఒ మియా తేరి ప్యారే మే పడిపోయా మై

బేగం మేస్ తుమ్ కో ఇష్క్ కర్తా హు
చమ్కీ గమ్కీ కొట్టుకొని
షాది గీది చేసేస్ కోని
చోటా ఇల్లే కట్టేసుకుందాము
ఖుషిలో క్రికెట్ టీమ్ పుట్టించేద్దాము

చమ్కీ గిమ్కీ కొట్టుకొని
షాది గీది చేసేస్ కోని
చోటా ఇల్లే కట్టేసుకుందాము
ఖుషిలో క్రికెట్ టీమ్ పుట్టించేద్దాము

షాదీ గీది చోడో జీ చుమ్మా ఇపుడే దేదో జి
టక్కున నువ్వే మమ్మీవౌతావు
ప్యార్ మేస్ చోడ్ దియా మే
ఓ జాను మేరే ప్యార్ మే చోడ్ దియా మై
ఖానా పీనా నహి రే బావా కడుపుకే
నిద్ర గిద్ర ఆతి నహిరే కళ్ళకే
జిందగీ హలాల్ అయిందిరో
ప్యార్ మే పడిపోయా మై
ఒ మియా తేరి ప్యారే మే పడిపోయా మై












Bujji Pilla Tella Pilla



1 2 3 4 why not check your booty
అమ్మమ్మో పిచ్చా బ్యూటి
I am the driving in the city o my naughty
మనమ్ము వెళ్దాం ఊటీ
అరే కమ్ కమ్ దా నా తోటి
ఈ పోటుగాడికి నో పోటి
Ok love love love love after love
Hot step no tension baby
నువ్ నా బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యు పిల్లా
ఇంకా నువ్వు నేను కపిలింగ్ అయితే
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యు పిల్లా
ఇంకా నువ్వు నేను కపిలింగ్ అయితే
సలామ్ నమస్తే వణక్కం బేబి

You wear you wear you wear డస్రు It so షార్టు where are the rest అమ్మా అరె I wanna tell you I wanna tell you You're so hot అమ్మా మామా
స్లీపింగ్ లేదే ఈటింగ్ లేదే
చలి జ్వరం వస్తుందే
You have curves, i have the packs Lets sing duet మా
నువ్వు ఫారన్ చాక్లెట్ మా
నేను లోకల్ బిస్కెట్ మా
అరె dont go my heart rate down Foreign figure అమ్మా
నువ్ నా బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యు పిల్లా
ఇంకా నువ్వు నేను కపిలింగ్ అయితే
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యు పిల్లా
ఇంకా నువ్వు నేను కపిలింగ్ అయితే
సలామ్ నమస్తే వణక్కం బేబి

You're so bright i am not వైటూ Its ok all రైటూ
అరె love is blindu love is గాడు Restu all bullshitu
నువ్వు ఇంగ్లీషు నేను లో క్లాసు
లుక్ అయితే బిందాసు
You're the flightu i am the ఫైలెట్టు Lets go love రూటు
మైలేజ్ చాలా good అమ్మా Horse power పిచ్చ high అమ్మా అరె white beauty super hotty నేను పిచ్చోడైపోయా
నువ్ నా బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యు పిల్లా
ఇంకా నువ్వు నేను కపిలింగ్ అయితే
బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్
బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఐ లవ్ యు పిల్లా
ఇంకా నువ్వు నేను కపిలింగ్ అయితే
సలామ్ నమస్తే వణక్కం బేబి













Thursday, 15 March 2018

Rama Lali



రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన ధశరధతనయా.. లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన ధశరధతనయా.. లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ

నిద్దరనైనా పెదవుల నవ్వుల ముద్గరలుండాలీ
తూగే జోలకు సరిగే ముంగురు లూగుతుండాలీ
ఇదే అమ్మ ఒడి ఉయ్యాల ఇదో నవరత్న డోలా
ఏది కావాలి, ఎవ్వరు ఊపాలి, ఎవ్వరూ జోల పాడాలి
నేనా...నేనో... నేనే

రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన ధశరధతనయా.. లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ

ఎందుకు ఆ చందమామా
ఎవ్వరి విందు కోసమో రామా.. శ్రీ రామా
ఎందుకు ఆ చందమామా
అందగాడనా  నీ కన్నా, అందరాడనా ఓ కన్నా
అందగాడనా నీ కన్నా, అందరాడనా ఓ కన్నా
తరగని తగ్గని జాబిలి మా సరసనే ఉండగా
కరగని చెరగని పున్నమిమా కనులలో నిండుగా
మా కనులలో నిండుగా
ఎందుకు ఆ చందమామా

గురుబ్రహ్మా గుర్విష్ణు గురుదేవో మహేశ్వరా
గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురవేనమహ

వేలెడంత లేడు వేయి విద్యల దొరయైనాడు
ఆ వీర బాలమూర్తి  సౌరు చూడు చూడవే
ఆ తండ్రి గారి మురియు తీరు చూడు
చదువులకై గురువుల కడ ఒదిగి ఉండు వినయము
అదెరా విల్లందుకొని అమ్ము వేయు వీరము
అదెరా విల్లందుకొని అమ్ము వేయు వీరము

అన్ని గుణములెదురొచ్చి అయ్యను కొలిచేను
రామయ్యను కొలిచెనూ

పైనకాస్తే వెన్నలౌను పందిరేస్తే మల్లెలౌను
పడతి జానకి పెదవి పూస్తే పారిజాతాలూ
కన్నె జానకి మదిని దాస్తే సన్న సన్నని వలపులు
లేత మామిడి పూత కోరు తీగ పందిరి ఊత కోరు
సీతకా శ్రీరామచంద్రుల చెలిమియే వైకుంఠమూ
ఆదిలక్ష్మి దేవికా హరి ఆంతరంగ నివాసమూ