రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన ధశరధతనయా.. లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన ధశరధతనయా.. లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ
నిద్దరనైనా పెదవుల నవ్వుల ముద్గరలుండాలీ
తూగే జోలకు సరిగే ముంగురు లూగుతుండాలీ
ఇదే అమ్మ ఒడి ఉయ్యాల ఇదో నవరత్న డోలా
ఏది కావాలి, ఎవ్వరు ఊపాలి, ఎవ్వరూ జోల పాడాలి
నేనా...నేనో... నేనే
రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన ధశరధతనయా.. లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ
ఎందుకు ఆ చందమామా
ఎవ్వరి విందు కోసమో రామా.. శ్రీ రామా
ఎందుకు ఆ చందమామా
అందగాడనా నీ కన్నా, అందరాడనా ఓ కన్నా
అందగాడనా నీ కన్నా, అందరాడనా ఓ కన్నా
తరగని తగ్గని జాబిలి మా సరసనే ఉండగా
కరగని చెరగని పున్నమిమా కనులలో నిండుగా
మా కనులలో నిండుగా
ఎందుకు ఆ చందమామా
గురుబ్రహ్మా గుర్విష్ణు గురుదేవో మహేశ్వరా
గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మైశ్రీ గురవేనమహ
వేలెడంత లేడు వేయి విద్యల దొరయైనాడు
ఆ వీర బాలమూర్తి సౌరు చూడు చూడవే
ఆ తండ్రి గారి మురియు తీరు చూడు
చదువులకై గురువుల కడ ఒదిగి ఉండు వినయము
అదెరా విల్లందుకొని అమ్ము వేయు వీరము
అదెరా విల్లందుకొని అమ్ము వేయు వీరము
అన్ని గుణములెదురొచ్చి అయ్యను కొలిచేను
రామయ్యను కొలిచెనూ
పైనకాస్తే వెన్నలౌను పందిరేస్తే మల్లెలౌను
పడతి జానకి పెదవి పూస్తే పారిజాతాలూ
కన్నె జానకి మదిని దాస్తే సన్న సన్నని వలపులు
లేత మామిడి పూత కోరు తీగ పందిరి ఊత కోరు
సీతకా శ్రీరామచంద్రుల చెలిమియే వైకుంఠమూ
ఆదిలక్ష్మి దేవికా హరి ఆంతరంగ నివాసమూ
No comments:
Post a Comment