ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేరా
ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేరా
ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ ఎందుకు పాస్తా ఇంకెదుకులే
ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ ఎందుకు పాస్తా ఇంకెదుకులే
ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేరా
ఇడ్డెన్ల లోకి కొబ్బరి చెట్నీ పెసరట్టులోకి అల్లంరా
ఇడ్డెన్ల లోకి కొబ్బరి చెట్నీ, పెసరట్టులోకి అల్లంరా
దిబ్బరొట్టికి తేనెపానకం , దొరకకపోతే బెల్లమురా
దిబ్బరొట్టికి తేనెపానకం, దొరకకపోతే బెల్లమురా
వేడి పాయసం ఎప్పటికప్పుడే , పులిహోరెప్పుడు మరనాడే
వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మరనాడే
మిర్చిబజ్జి నోరు కాలవలె ,ఆవడ పెరెగున తేలవలె
గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా
గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా
గుమ్మడికాయ పులుసుందంటే ఆకును సైతం నాకుమురా
పనసకాయని కొన్నరోజున పెద్దలు తద్దినం అన్నారు
పనసపొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు
తిండి గలిగితే కండగలదని గురజాడవారు అన్నారు
అప్పదాసు ఆ మాట పట్టుకొని ముప్పిటలా తెగ తిన్నారు
No comments:
Post a Comment