కాలేజ్ సందులు తిరిగాడు
కోవెల్లు కేఫ్ లు తిరిగాడు
సినిమా హాల్లకు వెళ్లాడు
ప్రతి ఒక సీటును వెతికాడు
అమ్మాయి గాని కనపడగానే ఐ లవ్ యూ అంటాడు
ఆ పిల్ల నుండి రిప్లై రాక మొదటికి వస్తాడు
గూగులు గూగులు గూగులు గర్ల్ ఫ్రెండుని వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్ ప్రేమ కోసం బ్రతికే పాగల్
గూగులు గూగులు గూగులు గర్ల్ ఫ్రెండుని వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్ ప్రేమ కోసం బ్రతికే పాగల్
పిల్లా నువ్ సయ్యైంటే చాలు రయ్యైని వచ్చేస్తాను
నయ్యైంటు చెప్పొద్దే పిల్లా కయ్యైని ఏడుస్తాను
మేలు చేసే ప్రేమికుడు మళ్ళి నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్లా పండగే నీకు అమ్మ తోడు
ప్రేమించే పాగల్, పంచిస్తా కాదల్, తోడు లేని సింగిల్ జన్మకెన్ని బాధల్
నవ్విస్తా నవ్వుల్ల్, రోజిస్తా పువ్వుల్ల్
ఒప్పుకుంటే జిందగి మొత్తం నీకు జిల్ జిల్
నిన్ను పువ్వుల్లోన పెట్టి సూసుకుంటా రావే ఇల్లా
నీకోసం కడతా కత్తిలాంటి పాలరాతి ఖిల్లా
నువెట్టా ఉన్నా ఏంచేస్తున్నా ఫర్వాలేదే మళ్ళా
నువ్వ్ ఒప్పుకుంటే మొత్తం మోత మోగుతాది జిల్లా
అమ్మాయి కనపడగానే ఆ సగం ప్రేమిస్తాడు
అమ్మాయి ఒప్పుకుంటే మన పాగల్ సారూ మొత్తం ప్రేమిస్తాడు
ప్రపంచం పెద్దది అంటాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు
ఈ ఊళ్ళో వర్కౌట్ అవకుంటే పక్కూరికి పోతాన్ అంటాడు
టెలిస్కోపు కన్నులతోటి గాలిస్తుంటాడు
హారోస్కోపు కలవకపోయినా ఆరాధిస్తాడు
అమ్మాయిలో అమ్మను చూస్తాడు ఆ ప్రేమని అన్వేషిస్తాడు
తెగించి ముందుకు పోతాడు ముగింపు ఈ కధకేనాడు
గూగులు గూగులు గూగులు గర్ల్ ఫ్రెండుని వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్ ప్రేమ కోసం బ్రతికే పాగల్
గూగులు గూగులు గూగులు గర్ల్ ఫ్రెండుని వెతికే గూగులు
వీడు పాగల్ పాగల్ పాగల్ ప్రేమ కోసం బ్రతికే పాగల్