ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే
ఎకాఎకి కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపంలేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా
కళ్లతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా
నిన్నా మొన్నా గుర్తే రాని సంతోషాలే పంచైనా
ఎన్నాల్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వలా కట్టానా
క్షణమైనా కనపడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే
ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే
చలే నీకు చేరిందంటే వణుకే నాకు పుట్టేనే
దేహం నీది నీ ప్రాణమే నేనులే
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే
ఎకాఎకి కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపంలేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మ జన్మలా జంటవ్వనా
No comments:
Post a Comment