Apple Beauty
దివి నుండి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ
నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ /2/
నువు పుట్టక ముందీ లోకం చీకటీ
నీ పలుకే ఎడిసన్ బల్బై ఉందా ఏమిటీ
నీ అందం మొత్తం.ఓఓఓ.... ఓ బుక్ గా రాస్తే ఆకాశం... ఓఓఓ
నీ సొగసునీ మొత్తం.. ఓఓఓ .....ఓ బంతిగా చేస్తే భూగోళం /దివి/
సెల్ఫీ తీస్తున్నానిన్నూ చూస్తూ కెమెరా కన్నూ క్లిక్ కే కొట్టడం మర్చిపోతుందే
స్పైసీ చూపుల్తో అట్టా చెంపా కొరికేస్తే నువ్వు
ఐఫోన్,యాపిల్ సింబల్ గుర్తొస్తొందే
కాఫీడేలో విన్నా సూఫీ.. మ్యూజిక్ లా
జుమ్మా జుమ్మాంది నీ అందం ఒక్కటే
దేశం బోర్డర్ లోని ఆసమ్ సోల్జర్ లాగా
కాటుక కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ /దివీ/
సన్న నడుమొంపుల్లోన సగమే ఆ చందమామ
భల్లేగా లెఫ్టో రైటో సెటిలైయిందే
మ్యాన్లీ కనుపాపల్లోన
మండే ఓ ఫుజ్జియమ్మ
లావా వరదల్లే చుట్టూ ముడుతుందే
పిల్లా నువ్వే గానీ నేపాల్లో పుట్టి ఉంటే
ఎవరెస్ట్ మౌంటెన్నైనా హీటెక్కిస్తావే....
ఆడి కార్ సున్నాలాగా
నువ్వు నేను పెనవేస్తే
చూసే కళ్ళు పట్టపగలే ఫడ్ల్ లైట్స్ అవుతాయే ..../దివి/
JAYAHO JANATHA
ఎవర్రు ఎవరు మీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
అయినా అందరీ బంధువులూ
జయహో.......జనతా
ఒక్కడు కాదూ ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో......జనతా
వెనకడుగైపోరు
మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే
పరివారం అంటారు
ప్రాణం పోతున్నా
ప్రమాదం అనుకోరు
పల్లెకే వెలుగిచ్చే
దైర్యంగా పుడతారు
ఎవర్రు ఎవరు మీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
అయినా అందరీ బంధువులూ
జయహో.......జనతా
ఒక్కడు కాదూ ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో......జనతా
ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకు పోతారూ
దుర్మార్గం నిలిపేలా
చీకటి కల్పిత తీర్పూ
వీరందిచే ఓదార్పు
తోడై ఉంటారు
పోటెత్తిన బంధంలా
మనసే కష్టంగా
ప్రతి మనిషికీ చుట్టంలా
మేం ఉన్నామంటారు
కన్నీల్లలో పువ్వులు పూయిస్తూ
ఎవర్రు ఎవరు మీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
అయినా అందరీ బంధువులూ
జయహో.......జనతా
ఒక్కడు కాదూ ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో......జనతా
ధర్మం గెలవనిచోట, తప్పదు కత్తుల వేట
తప్పు ఒప్పేదో సంభారం తర్వాత
రణమున భగవద్గీత,చదివిందీ మన చరితా
రక్కసి మూకలకు బతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారూ
మనకెదో చేస్తారూ
అని వేచే వేదనకూ
జవాబే ఈ జనతా..
ఎవర్రు ఎవరు మీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
అయినా అందరీ బంధువులూ
జయహో.......జనతా
ఒక్కడు కాదూ ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
నీ సెలవడిగి
నీ సెలవడిగీ నే కదిలెలుతున్నా
నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ
మెలిపెడుతుందే లోపల
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబందం నేటిదా
భారంగా... ఉంది నిజం
దూరంగా వెళుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసం ఏదైనా సమ్మతం
పక్కా లోకల్
హల్లో హల్లో మైక్ టెస్టింగ్
సభకు నమస్కారం, నా సొంత పేరు బంగారం
వంటి తీరు తగరం
పుట్టిందేమో యానాం, కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు మిర్చి కారం
నేలబారు లాగుంటది నా యవ్వారం
ఇంగ్లీషులోన దణ్ణం యెట్టనెప్పుడు
తేట తెలుగులోన మీకు వందనం
ఫేస్ క్రీమ్ గట్రా పూయలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంటా పసుపు చంధనం
సెల్ నెంబరే లేదు నాకు అస్సలూ
డోరు నెంబరే మీకు ఇస్తలే
సెంటు బాటిలూ ముట్టనైనా ముట్టలే
సన్నజాజులంటే సెడ్డ మోజులే
ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచినా
దబదబా డాబాకే పరుగుతీస్తలే
డిస్కోలో పబ్బులో డిమ్ లైట్ కొట్టినా
మావి తోటలోన మేళ మెడతాలే
ఎందుకూ........
ఎందుకంటే ..
నేను పక్కా లోకల్ పక్కాలోకల్
నేను పక్కా లోకలో
నేను వాడే గాజుల్ కోక రైకల్
అన్ని ఊర మాసు లెక్కలో
oneplus one ఆఫర్ ఉన్నదే..
london నెలొద్దాం లగేజెట్టుకో
నే ఉన్నూరూ గీత దాటనే
సరుకు తోటల్లో సైకిలేసులో
పిల్లా నీ body భలే భలే మెరిసిపోతదే
ఇంద డైమండ్ necklace తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరసకుదరదే
తెచ్చి తిరణాల పూసల దండెసుకో
నువు చాలా సింపులే
ఇదేముందీ శాంపిలే
Pashగుండలేదు నా సిస్టమూ
ఎందుకేంటీ
ఎందుకంటే....
oneplus one ఆఫర్ ఉన్నదే..
london నెలొద్దాం లగేజెట్టుకో
నే ఉన్నూరూ గీత దాటనే
సరుకు తోటల్లో సైకిలేసులో
పిల్లా నీ body భలే భలే మెరిసిపోతదే
ఇంద డైమండ్ necklace తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరసకుదరదే
తెచ్చి తిరణాల పూసల దండెసుకో
నువు చాలా సింపులే
ఇదేముందీ శాంపిలే
Pashగుండలేదు నా సిస్టమూ
ఎందుకేంటీ
ఎందుకంటే....
నేను పక్కా లోకల్ పక్కాలోకల్
నేను పక్కా లోకలో...
నేను వాడే గాజుల్ కోక రైకల్
అన్ని ఊర మాసు లెక్కలో
ప్లాస్మానా బ్లాక్ అండ్ వైటా
టివీ ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపుగుంటాది వివిధభారతీ
morphy రేడియో నువ్ గిఫ్ట్ ఇచ్చుకో
అటో హైటెక్కు ఈ పక్కా మెకానిక్కు
నీకిద్దరిలో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏమున్నది కిక్కు
రెంచీ స్పానర్ కే నా ఓటు రాసుకో
టచ్ చేసావమ్మడూ
నేనింతే పిల్లడూ
నచ్చీసావదంటా క్లాస్ ఐటమూ..
ఎందుకే..
ఎందుకేంటెహే..
ప్లాస్మానా బ్లాక్ అండ్ వైటా
టివీ ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపుగుంటాది వివిధభారతీ
morphy రేడియో నువ్ గిఫ్ట్ ఇచ్చుకో
అటో హైటెక్కు ఈ పక్కా మెకానిక్కు
నీకిద్దరిలో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏమున్నది కిక్కు
రెంచీ స్పానర్ కే నా ఓటు రాసుకో
టచ్ చేసావమ్మడూ
నేనింతే పిల్లడూ
నచ్చీసావదంటా క్లాస్ ఐటమూ..
ఎందుకే..
ఎందుకేంటెహే..
నేను పక్కా లోకల్ పక్కాలోకల్
నేను పక్కా లోకలో...
నేను వాడే గాజుల్ కోక రైకల్
అన్ని ఊర మాసు లెక్కలో
ప్రణామం... ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులే తడి మేఘలూ
హృదయమే గగనం రుధిరమే సంద్రం
ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నెనెంత రవ్వంతా
ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత
అనుభవమే దాచింది కొండంతా
తన అడుగుల్లో అడుగేసి వెళ్దాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ఎవడికి సొంతమిందంతా ఇది ఎవ్వడూ నాటిన పంటా
ఎవడికి వాడు నాదే హక్కనీ చెయ్యేస్తే ఎట్టా
తరముల నాటి కధంతా మన తదుపరి మిగలాలంటా
కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంటా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకందాం
కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరం మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
No comments:
Post a Comment