Wednesday, 24 August 2016

Nuvvena Naa Nuvvena

నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..
సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభాతమేనా..
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా..
చేరువైనా దూరమైనా ఆనందమేనా..
చేరువైనా దూరమైనా ఆనందమేనా..
నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..

మేఘమల్లే సాగివచ్చి, దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావో
కలలేనా కన్నీరేనా...
తేనెటీగలాగ కుట్టి తీపి మంట రేపుతావో
పువ్వులాంటి గుండెలోనా దారమల్లే దాగుతావో
నేనేనా నా రూపేనా..
చేరువైనా దూరమైనా ఆనందమేనా..చేరువైనా దూరమైనా ఆనందేమేనా..
ఆనందమేనా.. ఆనందమేనా...
నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..

కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావో
ఏ రాగం ఇది ఏ తాళం
మసక వెన్నెలల్లే నీవు ఇసక తిన్నె చేరతావు
గస గసాల కౌగిలింత.. గుసగుసల్లే మారుతావో..
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.., చేరువైనా దూరమైనా ఆనందేమేనా..
ఆనందమేనా.. ఆనందమేనా...
నువ్వేనా.. నా నువ్వేనా.. నువ్వేనా... నాకూ నువ్వేనా..

No comments:

Post a Comment