Wednesday, 24 August 2016

Vachhe Vachhe

వచ్చే వచ్చే నల్ల మబ్బులారా.. గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా..
కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా.. గాలి వానా లాలి పాడిస్తారా..

పిల్లపాపలా వానా.. బుల్లి పడవల వానా..
చదువు బాధనే తీర్చీ సెలవులిచ్చినా వానా
గాలి వానా కాపాడీ.. వేడి వేడి పకోడీ..ఈడు జోడు డీ డీ డీ తోడుండాలి ఓ లేడీ
ఇంద్రధనుస్సులో తళుకుమనే ఎన్ని రంగులో..
ఇంతి సొగసులే తడిసినవి నీటి కొంగులో..
శ్రావణమాసాల జల తరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం..
కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్ల మబ్బులారా.. గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా..

కోరి వచ్చిన ఈ వానా, గోరువెచ్చనయి నాలోనా
ముగ్గుల సిగ్గు ముసిరేస్తే ముద్దులాంటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు
గాలివానాల పందిళ్ళు , కౌగిలింతల పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు దాటినా చినుకులతో ఎదురుచూపులా
 నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహాల వలపు పందెం
కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా.. గాలి వానా లాలి పాడిస్తారా..
వచ్చే వచ్చే నల్లమబ్బులారా .. గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా..

కళ్లలోనా పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్

గుండెలోనా దాచుకున్నా బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా.. గాలి వానా లాలి పాడిస్తారా..

No comments:

Post a Comment