చెలియా లేదు చెలిమి లేదు/2/
వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే/2/
మిగిలింది నీవేనే
చెలిమి పోయే చెలుగు పోయే
నెలవే వేరయా
చేరదీసి సేవ చేసే తీరు కరువాయే
నీ దారే వేరాయా
మరుపురాని బాధ కన్నా
మధురమేలేదూ
గతము తలచి వగచే కన్నా
సౌఖ్యమే లేదూ
అందరాని పొందు కన్నా అందమే లేదు
ఆనందమే లేదూ /చెలిమి
వరదపాలవు చెరువులైన పొడలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలే జాడేలే
దారి లేని బాధ తో నే ఆరిపోయేనా
కధ తీరి పోయేనా
కధ తీరి పోయేనా
No comments:
Post a Comment