Wednesday, 28 February 2018

raama nIla mEgha syaamaa




జయతు జయతు మంత్రం
జన్మ సాపల్య మంత్రం
రామ్ రామ్ రామ్
జనన మరణ ధీదక్లేశ విచ్చేద మంత్రం
రామ్ రామ్ రామ్
సకల నిగమ మంత్రం , సర్వ శాస్ర్తైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం

రామ నీల మేఘశ్యామ కోదండరామా
రఘుకులాబ్ది సోమా పరంధామా సార్వబౌమా
రామ నీల మేఘశ్యామ కోదండరామా
రఘుకులాబ్ది సోమా పరంధామా సార్వబౌమా
నీల మేఘశ్యామ 
రఘు రామ్ రామ్ రామ్  రఘు రామ్
జయ రామ్ రామ్ రామ్  జయ రామ్

తల్లితండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే
తల్లితండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే
థరణిజెల్ల పాలన చేశా పరంజ్యోతివే
జాగు ఇక చాలును రామయ్యా , దాసులను బ్రోవగా రావయ్యా
జాగు ఇక చాలును రామయ్యా, దాసులను బ్రోవగా రావయ్యా
తెలియ తరమా, పలుక వశమా
నీదు మహిమా రాఘవ
రామ నీల మేఘశ్యామ కోదండరామా
రఘుకులాబ్ది సోమా పరంధామా సార్వబౌమా
రామ నీల మేఘశ్యామ కోదండరామా
రఘుకులాబ్ది సోమా పరంధామా సార్వబౌమా
నీలమేఘశ్యామా

రాతినైన నాతిగా జేసే నీ దివ్యపాదము
రాతినైన నాతిగా జేసే నీ దివ్యపాదము
కోతినైన జ్ఞానిగా జేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నే నమ్మితి రామయ్యా
నీదు సరి దైవము లేరయ్యా, నిన్ను నే నమ్మితి రామయ్యా
నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
రామ నీల మేఘశ్యామ కోదండరామా
రఘుకులాబ్ది సోమా పరంధామా సార్వబౌమా
రామ నీల మేఘశ్యామ కోదండరామా
రఘుకులాబ్ది సోమా పరంధామా సార్వబౌమా
నీల మేఘశ్యామ 
రఘు రామ్ రామ్ రామ్  రఘు రామ్
జయ రామ్ రామ్ రామ్  జయ రామ్
రఘు రామ్ రామ్ రామ్  రఘు రామ్
జయ రామ్ రామ్ రామ్  జయ రామ్








Saturday, 17 February 2018

Adestane ammi



ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే 
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తనే అమ్మి , ఆడేస్తానే
ఎన్టీఓడి పాట పాడి , ఏన్ఆర్ స్టెప్పులేసి
ఎన్టీఓడి పాట పాడి, ఏన్ఆర్ స్టెప్పులేసి
క్రిష్ణలాగా ఫైటింగ్ చేసేస్తానే
నువు ఊ అంటే చిరంజీవి
 అయిపోతానే
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే 

రాజబాబు డైలాగ్ చెప్పేస్తా నేను
అమ్మో ఎవరండి బాబు రౌడీస్ అయ్యబాబోయ్
అల్లు మామలాగా ఆడేస్తా నేను
ఆ..ఆ...ఆ..ఆ.ఆ
రాజబాబు డైలాగ్ చెప్పేస్తా నేను
అల్లు మామలాగా ఆడేస్తా నేను
రేలంగిలాగా నడిచేస్తా నేను
రేలంగిలాగా నడిచేస్తా నేను
రమణారెడ్డిలాగా ఊగేస్తా నేను
అం అహ, ఉం ఉహు, కం కహ
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే 
ఎన్టీఓడి పాట పాడి , ఏన్ఆర్ స్టెప్పులేసి
ఎన్టిఓడి పాట పాడి, ఏన్ఆర్ స్టెప్పులేసి
క్రిష్ణలాగా ఫైటింగ్ చేసేస్తానే
నువు ఊ అంటే చిరంజీవి
 అయిపోతానే
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే
డడడ డడడ డడడ డడడ డడ
డడడ డడడ డడడ డడడ డడ

ముత్యాలు నా పక్క తోడుగా ఉంటే
బైరాగి తాత నీడగా ఉంటే
ముత్యాలు నా పక్క తోడుగా ఉంటే
బైరాగి తాత నీడగా ఉంటే
సివంగి మామ నా పెళ్లి చేసేస్తా
సివంగి మామ నా పెళ్ళి చేసేస్తా
చీకుచింత లేక చిందులేస్తా ఉంటాను
చీకుచింత లేక చిందులేస్తా ఉంటాను
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే 
ఎన్టీఓడి పాట పాడి , ఏన్ఆర్ స్టెప్పులేసి
ఎన్టీఒడి పాట పాడి, ఏన్ఆర్ స్టెప్పులేసి
క్రిష్ణలాగా ఫైటింగ్ చేసేస్తానే
నువు ఊ అంటే చిరంజీవి
 అయిపోతానే

పులేషం ,,,..........
కోలాటం, ............ 
కోల్ కోలు కోలే కోలన్న కోల్ కోలే ఆ మేల్ కోల్ కోలే  ఆ మేల్ కోలన్నా
డిస్కో.............. యా........
డుబుస్కూ.....
జనకు జనకు జన్నా
ఆడేస్తానే అమ్మి , పాడేస్తానే
పాడేస్తానే అమ్మి , ఆడేస్తానే 








Kila Kilamani Kalavaru



కిలకిలమనే కళావరు రాణి 
ఘల్లుఘల్లు మనే కధాకళి కానీ 
కళ్ళెం లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హలో అని 
చల్ మోహనాంగ సుఖాలకు బోణీ 
చలిగిలి అన్నీ పొలో మని పోనీ 
సిగ్గే లేని సింగారాన్ని చిందించనీ చలో హనీ 
మదనుడి పాలై పోనీ ముదిరిన భావాలన్నీ 
మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ 


బరువుగా విరివిగా కాపు చూపె కద ఏపుగా గోపిక 
చొరవగా కరువుగా కాపు వేసె కద కైపుగా కోరిక 
వాలే పరువాలే తగువేళే గనుక 
కాలే తమకాలే గమకాలే పలుక 
కాంక్షలో శృతి గతి పెంచి కాల్చదా చుట్టూ కట్టే కంచె ఈ మైకం 
ఈడులో అతి గతి లేని వేడికో దిక్కు మొక్కు పంచే ఈ రాగం 
ఆదమరిచిన ఈడులో ఈతలాడనీ.. 



ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం 
చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం 
తాపం తెర తీసి తరిమేసే తరుణం 
కాలం తలుపేసి విరబూసే సమయం 
వీలుగా గుట్టు మట్టు మీటి లీలగా ఇట్టే పుట్టే వేడి యాడేడో.. 
ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టెయ్యాలి ఏ నీడో 
జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ...


Kotha Kothaga





కొత్త కొత్తగా వున్నది 
స్వర్గమిక్కడే అన్నది 
కోటి తారలే.. పూల ఏరులై.. 
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగా..నే 
కొత్త కొత్తగా వున్నది 
స్వర్గమిక్కడే అన్నది 


నా కన్ను ముద్దాడితే 
కన్నె కులుకాయే కనకాంబరం 
నా చెంప సంపెంగలో 
కెంపు రంగాయే తొలి సంబరం 
ఎన్ని పొంగులో కుమారి కొంగులో 
ఎన్ని రంగులో సుమాల వాగులో 
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
             ఉద్యోగామిప్పించవా షోకు ఉద్యాన వనమాలిగా 
                    జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా 
కొత్త కొత్తగా ఉన్నది,స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగా...నే
కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే ఉన్నది


      నీ నవ్వు ముద్దాడితే 
        మల్లెపువ్వాయే నా యవ్వనం 
                                     నాజూకు మందారమే 
                                 ముళ్ళ రోజాగా మారే క్షణం 
                              మొగలి పరిమళం మగాడి కౌగిలి 
                              మగువ పరవశం సుఖాల లోగిలి

మొగలి పరిమళం మగాడి కౌగిలి
మగువ పరవశం సుఖాల లోగిలి
                                   కండల్లో వైశాఖమా 
                              కైపు ఎండల్లో కరిగించుమా 
                                తీగ మల్లికి నరాల పందిరి 
                                      అందించుకోనా

కొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగా..నే





Dandaalayya



జై జై జై జై గణేశ జై జై జై జై 
జై జై జై జై వినాయకా జై జై జై జై 

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా 
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా 
పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా 
తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా 
ఓఓఓఓఓఓఓఓఓఓ
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ



 చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం

 హోయ్ హోయ్ హోయ్
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జెగములు తిప్పిందిరా 
ఓహోహోహోహో జన్మ ధన్యం 
హొయ్ హొయ్ 
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
అంబారిగా ఉండగల ఇంతటి వరం
అయ్యోరే అయ్యా 
అంబా సుతా ఎందరికి లభించురా 
అయ్యోరే అయ్యా
ఎలుకనెక్కే ఏనుగు కధ చిత్రం కదా.. 
దండాలయ్యా ఉండ్రాలయ్యా  దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా దీవించయ్యా దేవా


              శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం

హొయ్ హొయ్
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా 
ఏమైపోయింది గర్వం 
హొయ్ హొయ్
శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
హొయ్ హొయ్
ఎక్కిన మదం దిగాందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
హొయ్ హొయ్
                            త్రిమూర్తులే నిను గని తలొంచరా 
అయ్యోరా అయ్యా
నిరంతరం మహిమను కీర్తించరా 
అయ్యోరే అయ్యా
నువ్వెంతనే అహం నువ్వే దండించరా 
దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా దయుంచయ్యా దేవా
నీ అండదండా ఉండాలయ్యా దీవించయ్యా దేవా

Saturday, 10 February 2018

Chappudaine Cheyyaledhe



సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే.. హే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే 
అక్కడొచ్చి కూర్చుందే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే హోయ్..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే..
 
ఓయ్..చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
నవ్వినట్లు ఉంటాదే నా పిల్లచూడు..నా పిల్లచూడు
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా 
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా
ముద్దు గానే ఉంటాడే నా పిల్లగాడు.. నా పిల్లగాడు
సింగమంటి పిల్లగాడు జింక పిల్ల లాంటి నాకు
వంగి లొంగి పోయాడే 

చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
సూడబోతే పూల రేకు పట్ట బోతే పిడిబాకు 
టక్కులెన్నొ నేర్చిందే 
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే

హొయ్ ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే 
ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే 
సిగ్గు బుగ్గి చేస్తాడే నా పిల్లగాడు 
నా పిల్లగాడు నా పిల్లగాడు
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది 
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది 
గుట్టు చెప్పనంటుంది నా పిల్ల చూడు
గుమ్మపాల పొంగులో గట్టు దాటు గంగలా 
మతి సెడగొడుతుందీ..

సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
నువ్వు తప్ప నాకు దిక్కు మొక్కు లేదంటు 
ఒట్టేసి చెబుతాడే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే 
అక్కడొచ్చి కూర్చుందే..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే.. 
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 

Naizam Pori


ఆ ఆ ఆ....
పాడనా గోపాలా కమ్మగా కైపే కమ్మగా కళ్ళే వాలగా...
ఊగనా ఉయ్యాలా మెల్లగా చల్లచల్లగా ఒళ్ళే తేలగా...

అరే గిదేం షురూ జేసినవమ్మా? ఇయాల రేపు ఎవడింటడు పాటవాడితే కిక్కుండాలె
నైజాము పోరి నస్దీకు చేరి నవ్వింది ఓసారి
నాజంట కోరి నకరాల మారి వచ్చింది భై ప్యారి
నైజాము పోరి నస్దీకు చేరి నవ్వింది ఓసారి
నాజంట కోరి నకరాల మారి వచ్చింది భై ప్యారి
బాగుంది భై జర లాగింది భై
ధిమాకు పాయె దిల్లు దిమ్మెక్కిపాయె
పంజగుట్ట తాన జూసి పంజరాన పెడతమంటె పట్టలేక పారిపోయెరో

జింగారే జీగుచాక జింగుచాక జింగారే జీగు చాక జింగుచాక
జింగారే జీగుచాక జింగుచాక జింగారే జీగు చాక జింగుచాక


జింగారే జింగుచాకు జింగుచాకు జింగారే జింగుచాకు జింగుచాకు
పైటను చూడగానె పైత్యమొస్తదా
పాడు బుద్ధి కోడెగాండ్లు పడతరేంది మీద మీద
పైలపచ్చీసు ఈడు గమ్మునుంటదా
మన్నుదిన్న పాములెక్క ఊరుకుంటె పరువు పోదా
పబ్లిక్కు చూస్తరన్న ఖాతరుండదా
ఇజ్జతు పోతదన్న జ్ఞానమైన కాస్తలేదా
ముస్తాబు మస్తుగుంటె నోరు ఊరదా
ఊకే ఉండమంటె మంచి మౌక జారిపోదా
ఆహాహా....
వామ్మో...ఒద్దమ్మో.....
కిక్కూ ఊపూ... అరె ఉండాలమ్మో....
ఉగ్గే ఆపు ఎందుకు ఏడ్పూ చెమకు చెమకు చిలకా

జింగారే జింగుచాకు జింగుచాకు జింగారే జింగుచాకు జింగుచాకు

రంపరప రప్పప్ప రంపరప్పా
రంపరప రప్పప్ప రంపరప్పా
రపపపా....పబ రపపపా...పబ
ప ప ప....

యాద్గిరి గుట్టకాన ఎదురుబడ్డది
ధుత్తెరి అంటు నన్ను గుస్సజేసి కస్సుమంది
ఒంటరి ఆడపిల్ల అంత లోకువా
తుంటరి పిల్లగాడ అక్కసెల్లి నీకు లేరా
హేయ్ మస్తిన్నం బీబీ
అక్కలు సెల్లెళ్ళు అందరుండినా
సక్కని సుక్కలాంటి ఆలి తక్కువాయెమల్ల

calm down baby don't be shy
why don't you take me on a date with you
oh my love... my darling ... yaa

ఏ ఏ ఏ.....ఏందయ్యో....
ఏందా స్పీడూ లేదా బ్రేకూ
అరె ఆటా పాటా సాగాలంటా ఫికరు దేనికంటా

నైజాము పోరి నస్దీకు చేరి నవ్వింది ఓసారి
నాజంట కోరి నకరాల మారి వచ్చింది భై ప్యారి
బాగుంది భై జర లాగింది భై
ధిమాకు పాయె దిల్లు దిమ్మెక్కిపాయె
పంజగుట్ట తాన జూసి పంజరాన పెడతమంటె పట్టలేక పారిపోయెరో
జింగారే జీగుచాక జింగుచాక జింగారే జీగు చాక జింగుచాక
జింగారే జీగుచాక జింగుచాక జింగారే జీగు చాక జింగుచాక

Pallavi:
Ā ā ā....
Pāḍanā g

Yemma Kopama



ఏమ్మా కోపమా.. 
లేదు చాలా సంతోషం..
లేటయ్యిందనా..
ఏ ఛీ నాతో మాట్లాడకు..
మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు.. 
వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు.. 
ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు.. కాబట్టి ఇంత లేటు..

ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా.. 
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది.. 
పోపోవోయ్ చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది.. 
సరేలే.. టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు.. 
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..


స్టోరీ చెప్పవద్దు.. బోరే కొట్టవద్దు.. వదిలేసేయ్ నన్నిలా..
సారీ చెప్పలేదా.. ఫైరింగ్ ఆపరాదా.. ఫైటింగ్ ఎంతసేపిలా..
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు..
వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు..
ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా..
చిన్న తప్పుకే మరీ ఇలా దుంప తెంచితే ఎలాగట.. 
పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో..
నీతో లవ్వంటే మరీ కత్తి మీద సాము కాదా..
ఓ చెలీ క్షమించమన్నానుగా.. 
నీకిది ఇవాళ కొత్తకాదుగా..

నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు..
స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వెయిట్ చెయ్యి మంచి మూడుకు..
దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా..
ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా..
కలుసుకున్నది డిబేటుకా.. ప్రేమ అన్నది రివెంజుకా..
ఎంతసేపని భరించను.. ఛస్తున్నదే నా ఓపిక..
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా..
ఓకే అనేస్తే ఎలా.... లోకువేగా నీకు ఇంక..

ఓ డియర్ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా.. 
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోమ్మా చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు..
ఓ డియర్ క్షమించమన్నానుగా....


Jaamu Rathiri



జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక పుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ నిదరతో నిషారాణి నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కఠిక చీకటి
కరిగిపోక తప్పందమ్మ ఉదయకాంతికి

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ




Poosindi Poosindi Punnaga



పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా
సందేళలాగేసే సల్లంగా  దాని సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పలై
ఆడా...... జతులాడా...
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా
సందేళలాగేసే సల్లంగా  దాని సన్నాయి జడలోన సంపెంగ


ఇష్టసఖీ నా చిలుక నీ కులుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కధ చెప్పాయిలే
అనుకోని రాగమై అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయు లీనమై
పాడే.... మదిపాడే...
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా
సందేళలాగేసే సల్లంగా  దాని సన్నాయి జడలోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పాదమే పారాణిగా
కట్లుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరిరాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఈ పూల తోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపలై
పూసే............. విరబూసే
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా
సందేళలాగేసే సల్లంగా  దాని సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పలై
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా
సందేళలాగేసే సల్లంగా  దాని సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పలై
ఆడా....జతులాడా...
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా
సందేళలాగేసే సల్లంగా  దాని సన్నాయి జడలోన సంపెంగ