Saturday, 17 February 2018

Kila Kilamani Kalavaru



కిలకిలమనే కళావరు రాణి 
ఘల్లుఘల్లు మనే కధాకళి కానీ 
కళ్ళెం లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హలో అని 
చల్ మోహనాంగ సుఖాలకు బోణీ 
చలిగిలి అన్నీ పొలో మని పోనీ 
సిగ్గే లేని సింగారాన్ని చిందించనీ చలో హనీ 
మదనుడి పాలై పోనీ ముదిరిన భావాలన్నీ 
మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ 


బరువుగా విరివిగా కాపు చూపె కద ఏపుగా గోపిక 
చొరవగా కరువుగా కాపు వేసె కద కైపుగా కోరిక 
వాలే పరువాలే తగువేళే గనుక 
కాలే తమకాలే గమకాలే పలుక 
కాంక్షలో శృతి గతి పెంచి కాల్చదా చుట్టూ కట్టే కంచె ఈ మైకం 
ఈడులో అతి గతి లేని వేడికో దిక్కు మొక్కు పంచే ఈ రాగం 
ఆదమరిచిన ఈడులో ఈతలాడనీ.. 



ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం 
చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం 
తాపం తెర తీసి తరిమేసే తరుణం 
కాలం తలుపేసి విరబూసే సమయం 
వీలుగా గుట్టు మట్టు మీటి లీలగా ఇట్టే పుట్టే వేడి యాడేడో.. 
ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టెయ్యాలి ఏ నీడో 
జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ...


2 comments: