సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే.. హే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే
అక్కడొచ్చి కూర్చుందే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే హోయ్..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే..
ఓయ్..చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
నవ్వినట్లు ఉంటాదే నా పిల్లచూడు..నా పిల్లచూడు
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా
ముద్దు గానే ఉంటాడే నా పిల్లగాడు.. నా పిల్లగాడు
సింగమంటి పిల్లగాడు జింక పిల్ల లాంటి నాకు
వంగి లొంగి పోయాడే
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
సూడబోతే పూల రేకు పట్ట బోతే పిడిబాకు
టక్కులెన్నొ నేర్చిందే
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
హొయ్ ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే
ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే
సిగ్గు బుగ్గి చేస్తాడే నా పిల్లగాడు
నా పిల్లగాడు నా పిల్లగాడు
నా పిల్లగాడు నా పిల్లగాడు
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది
గుట్టు చెప్పనంటుంది నా పిల్ల చూడు
గుమ్మపాల పొంగులో గట్టు దాటు గంగలా
మతి సెడగొడుతుందీ..
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
నువ్వు తప్ప నాకు దిక్కు మొక్కు లేదంటు
ఒట్టేసి చెబుతాడే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే
అక్కడొచ్చి కూర్చుందే..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే..
రెప్ప చాటునున్నాడే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు
చెప్పకుండ చేరినాడే
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
No comments:
Post a Comment