జై జై జై జై గణేశ జై జై జై జై
జై జై జై జై వినాయకా జై జై జై జై
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా
పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా
జై జై జై జై వినాయకా జై జై జై జై
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా
పిండివంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా
ఓఓఓఓఓఓఓఓఓఓ
దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
హోయ్ హోయ్ హోయ్
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జెగములు తిప్పిందిరా
ఓహోహోహోహో జన్మ ధన్యం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జెగములు తిప్పిందిరా
ఓహోహోహోహో జన్మ ధన్యం
హొయ్ హొయ్
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా
పాపం కొండంత నీ పెనుభారం
అంబారిగా ఉండగల ఇంతటి వరం
అంబారిగా ఉండగల ఇంతటి వరం
అయ్యోరే అయ్యా
అంబా సుతా ఎందరికి లభించురా
అంబా సుతా ఎందరికి లభించురా
అయ్యోరే అయ్యా
ఎలుకనెక్కే ఏనుగు కధ చిత్రం కదా..
ఎలుకనెక్కే ఏనుగు కధ చిత్రం కదా..
దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా దీవించయ్యా దేవా
శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
హొయ్ హొయ్
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
హొయ్ హొయ్
శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం
హొయ్ హొయ్
ఎక్కిన మదం దిగాందిగా తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం
హొయ్ హొయ్
త్రిమూర్తులే నిను గని తలొంచరా
అయ్యోరా అయ్యా
నిరంతరం మహిమను కీర్తించరా
నిరంతరం మహిమను కీర్తించరా
అయ్యోరే అయ్యా
నువ్వెంతనే అహం నువ్వే దండించరా
నువ్వెంతనే అహం నువ్వే దండించరా
దండాలయ్యా ఉండ్రాళ్లయ్యా దయుంచయ్యా దేవా
నీ అండదండా ఉండాలయ్యా దీవించయ్యా దేవా
No comments:
Post a Comment