Thursday, 15 March 2018

తనికెళ్ళభరణి



ఎంత మోసగాడివయ్యా శివ
నువ్వెంత వేషగాడివయ్యా శివ
ఎంత మోసగాడివయ్యా శివ
నువ్వెంత వేషగాడివయ్యా శివ

బయటకేమో లింగరూపమయ్యా శివ
బయటకేమో లింగరూపమయ్యా శివ
లోపల శ్రీరంగ రూపమయ్యా శివ
ఎంత మోసగాడివయ్యా శివ
నువ్వెంత వేషగాడివయ్యా శివ

పైన మూడు నామలేనయ్యా శివ
పైన మూడు నామలేనయ్యా శివ
నీకు లోన వేయి నామాలంటయ్యా శివ
ఎంత మోసగాడివయ్యా శివ
నువ్వెంత వేషగాడివయ్యా శివ

పైపైనే అభిషేకలయ్యా శివ
పైపైనే అభిషేకలయ్యా శివ
నీకు అలంకారం అంటగలదయ్యా శివ
ఎంత మోసగాడివయ్యా శివ
నువ్వెంత వేషగాడివయ్యా శివ

బయటకేమో తోలు బట్టలయ్యా శివ
బయటకేమో తోలు బట్టలయ్యా శివ
లోపల నీకు పీతాంబరాలయ్యా శివ
ఎంత మోసగాడివయ్యా శివ
నువ్వెంత వేషగాడివయ్యా శివ

నెత్తిన గంగమ్మతల్లంటయ్యా శివ
నెత్తిన గంగమ్మతల్లంటయ్యా శివ
నీ కాళ్ళకాడ పుట్టేనంటయ్యా శివ
ఎంత మోసగాడివయ్యా శివ
నువ్వెంత వేషగాడివయ్యా శివ





No comments:

Post a Comment