అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో
అభినయ రసమయ కాంతి ధారవో
అభినయ రసమయ కాంతి ధారవో
మంజుల మధుకళ సింజాన శుభశరా సింజిని
శివరంజనీ శివరంజనీ
అది ధరహాసమా మది మధుమాసమా
అది ధరహాసమా మది మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశి కిరణమ్ములా
అవి చరణమ్ములా శశి కిరణమ్ములా
నా కనుల భావన పరిణమ్ములా
అభినవ తారవో నా అభిమాన తారవో
శివరంజనీ శివరంజనీ
ఆ లయనాడు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ లయనాడు విరిసిన చాలు
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆమె నడుము ఆడిన చాలు
ఆమె నడుము ఆడిన చాలు
రవళించు పద కవితా ప్రబందములు
అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో
శివరంజనీ శివరంజనీ
నీ శృంగార లలిత భంగిమలో
పొంగిపోవురే ఋషులైనా
నీ కరుణ రసావిష్కరణల్లో
కరిగిపోవురే కర్కసులైనా
వీరమా నీ కుపితనేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికలోనా వశ్యమే
నవరస పోషణ జణవని
నటనాంకిత జీవనివని
నిన్ను కొలిచిఉన్నవాడా
నింగినందుకున్నావాడా
నీ ఆరాధకుడనను ఆస్వాదకుడను అనురక్తుడను
నీ ప్రియభక్తుడను
అభినవ తారవో నా అభిమాన తారకవో
శివరంజనీ శివరంజనీ
No comments:
Post a Comment