Friday, 25 May 2018

Telusa Manasa




తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతిక్షణం  ...  నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో  ...  అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే .. నీవుగా .. ప్రాణమే .. నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ

తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో

డార్లింగ్
ఎవెరీ బ్రీథ్ యు  టేక్ .. ఎవెరీ మూవ్ యు  మేక్ 
ఐ  విల్  బి  దేర్ విత్  యు
వాట్  వుడ్  ఐ  డూ  విత్  అవుట్  యు ...
ఐ  వాంట్  టు లవ్  యు  .. ఫర్ఎవెర్ ... అండ్  ఎవెర్  .. అండ్  ఎవెర్ 

ఎన్నడూ  … తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో  … తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ 



తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో


No comments:

Post a Comment