అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా...
అలక చాలింక
అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా
అలక చాలింక
శీతాకాలం సాయంకాలం
శీతాకాలం సాయంకాలం
అటు అలిగిపోయేవేళా, చలి కొరికి చంపే వేళా
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా
అలక చాలింకా
రామ రామ శబరి బామ్మ నిద్దరే పోదూ
రాతిరంతా చందమామ నిదర పోనీదూ
కంటి కబురా పంపలేనూ
ఇంటి గడపా దాటలేనూ
ఆ దోర నవ్వూ దాచకే నా నేరమింకా ఎంచకే
ఆ దోర నవ్వూ దాచకే ఈ నవ్వు నవ్వీ చంపకే
అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా
అలక చాలింకా
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరూ
రాయని ఆ నుదిటిరాత రాయనూలేరూ
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరూ
రాయని ఆ నుదిటిరాత రాయనూలేరూ
నచ్చినా మహరాజు నీవూ
నచ్చితే మహరాణి నేనూ
ఆ మాట ఏదో తెలిపితే మీ నోటి ముత్యం రాలునా
నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా
అల్లరాపమ్మా...
శీతాకాలం సాయంకాలం
శీతాకాలం సాయంకాలం
నను చంపకే తల్లీ జోకొట్టకే గిల్లీ
అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా
అలక చాలింకా
No comments:
Post a Comment