Sunday, 14 June 2020

Chinuku Chinuku Andelatho

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంటే
ఈ కౌగిలింతలోన ఏలో
గుండెల్లో ఎండ కాసే ఏలో
పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వల వేయగా సెలయేరై పెనవేసింది
చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటికేసే బుగ్గ మీద ఏలో
వలపు ఇక తొలివలపు తక జం తక జం
వయసు తడి సొగసు అరవిరిసే సమయం
ఆహా . ఊహూ ...

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసోచ్చే ఏలో
మేను చూపు పోయింది వాలు చూపు సయ్యంది
చలి కోరిక అలవోకగ తల ఊపింది
సరసాల సిందులోన ఏలో
సరిగంగ తానాలు ఏలో
ఒడిలో ఇక ఒకటై తకతకతై అంటే
సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే...
ఆహా . ఊహూ ...

No comments:

Post a Comment