ధారుణి రాజ్యసంపద మధంబున కోమలి కృష్ణజూచి
రంభోరుని జోరు దేశమున నుండగా పిల్చిన ఈ దురాత్ము
దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాబిఘాత
భగ్నోరుతరోరు జేయుదు సూయోధను ఉగ్ర రణాంతరంబునన్
కురువృద్దుల్ల్ గురువృద్ద భాందవులనేకుల్ చూచుచుండన్
మదోద్దురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్
లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్లైల రక్తౌఘ
నిర్జర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్
No comments:
Post a Comment