ప్రేమతో పిలిచినా పలకరించినా నన్ను
బతికి ఉన్నప్పుడే కొడకా
ప్రేమతో పిలిచినా పలకరించినా నన్ను
బతికి ఉన్నప్పుడే కొడకా
కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచినా లాభమేముంది కొడకా
నీవు కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేముంది కొడకా
పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా
పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా
పోయాక పెట్టేవి పంచభక్ష్యాలన్నీకాకి పాలే కదా కొడకా
వారు పోయాక పెట్టేవి పంచభక్ష్యాలన్నీ కాకి పాలే కదా కొడకా
తల్లి పోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు
తల్లి పోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు
ఆస్తులైనా అన్ని అంతస్తులైనా మున్నాళ్ల ముచ్చటే కొడకా
తల్లికి తండ్రికి వృద్దాప్యంలో కుడి భుజమై నిలవాలి కొడకా
నీవు తల్లికి తండ్రికి వృద్దాప్యంలో కుడి భుజమై నిలవాలి కొడకా
పోయాక మోసేటి భుజాలెనున్న లాభమేమున్నాది కొడకా
పోయాక మోసేటి భుజాలెనున్న లాభమేమున్నాది కొడకా
No comments:
Post a Comment