ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులందివ్వనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా
సయ్యాటలోనా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా
బ్రతుకులో చేదులున్న
భయమే వద్దురా
సుడిగుండం కాదురా
సుమగంధం ప్రేమరా
పెనుగండం కాదురా
అనుబంధం ప్రేమరా
సిరి తానుగానే వచ్చినిన్ను చేరునురా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనే వేయనా
ఆకాశపుటంచులే వంచనా
ఆ జాబిలి కిందకే దించనానా కన్నెకూన
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
ఆశగా పల్లవించే పాటే నీవులే
జీవితం తోడులేని మూడేంకాదులే
కలిసుండే వేళలో కలతంటూ రాదులే
అమవాసై పోదులే
అడియాశేం కాదులే
చిరుదివ్వె కాంతులింకదారి చూపునులే
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనే వేయనా
ఆకాశపుటంచులే వంచనా
ఆ జాబిలి కిందకే దించనానా కన్నెకూన
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
No comments:
Post a Comment