శరణం నీ దివ్య చరణం నీ నామమెంతొ మధురం
శరణం నీ దివ్య చరణం నీ నామమెంతొ మధురం
శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం నీ నామమెంతొ మధురం
శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం
భక్తుల బ్రోచే స్వామివి నీవే
పేదలపాలిటి పెన్నిధి నీవే
భక్తుల బ్రోచే స్వామివి నీవేపేదలపాలిటి పెన్నిధి నీవే
సకల జీవులను చల్లగ చూచే
సకల జీవులను చల్లగ చూచేకరుణామయుడవు నీవే
శరణం నీ దివ్య చరణం నీ నామమెంతొ మధురం
శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం
త్రేతాయుగమున శ్రీరాముడవై
ద్వాపరమందున గోపాలుడవై
త్రేతాయుగమున శ్రీరాముడవై ద్వాపరమందున గోపాలుడవై
ఈ యుగమందున వెంకటపతివై
ఈ యుగమందున వెంకటపతివై భువిపై వెలసితివీవే
శరణం నీ దివ్య చరణం నీ నామమెంతొ మధురం
శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం
నీ ఆలయమే శాంతికి నిలయం
నిను సేవించే బ్రతుకే ధన్యం
నీ ఆలయమే శాంతికి నిలయం నిను సేవించే బ్రతుకే ధన్యం
తిరుమలవాసా శ్రీ వేంకటేశా
తిరుమలవాసా శ్రీ వేంకటేశా మా ఇలవేలుపు నీవే
శరణం నీ దివ్య చరణం నీ నామమెంతొ మధురం
శ్రీ శేషశైలవాసా
శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం
No comments:
Post a Comment