శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శోభిల
దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కన్నతండ్రి కలలు నిండి
మా కన్న తండ్రి కలలు నిండి
కలకాలం వర్ధిల్లగా...
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
సిరులు యశము శోభిల
దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
పెరిగీ మా బాబు వీరుడై
ధరణీ సుఖాల ఏలగా
పెరిగీ మా బాబు వీరుడై
ధరణీ సుఖాల ఏలగా
తెలుగు కీర్తి తేజరిల్లి...
తెలుగు కీర్తి తేజరిల్లి
దిశలా విరాజిల్లగా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
సిరులు యశము శోభిల
దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
No comments:
Post a Comment