Friday, 5 August 2022

Niddura Pothunna

చెలియా నీవైపే వస్తున్నా
  కంటపడవా ఇకనైనా 
ఎక్కాడున్నా
 
  నిద్దర పోతున్నా రాతిరినడిగా 
 గూటికి చేరినా గువ్వాలనడిగా  
చల్లగాలినడిగా ఆ... చందమామనడిగా
  ప్రియురాలి జాడ చెప్పారేమనీ  
అందరినీ ఇలా వెంటపడి అడగలా
  సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా 
 చల్లగాలినడిగా  ఆ... చందమామనడిగా 
 ప్రియురాలి జాడ చెప్పారేమనీ  
అందరినీ ఇలా వెంటపడి అడగలా సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా  
 
అస్సలే ఒంటరితనం అట్టుపై నిరిక్షణం
అసల్లే ఒంటరితనం అటుపై నీరికణం
  అరెరే పాపమనీ జాలిగా చూసే జనం  
గోరంతా గొడవ జరిగితే కొండంతా కోపమా  
నను వదిలి నువ్వు ఉండగలవా నిజం చెప్పావమ్మా 
  అందరినీ ఇలా వెంటపడి అడగలా 
 సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా  
నిద్దుర పోతున్నా రాతిరి అడిగా 
  గూటికి చేరినా గువ్వాల అడిగా  
చల్లగాలి నడిగా
 ఆ.. చందమామ నడిగా 
 ప్రియురాలి జాడ చెప్పారేమనీ 
 
  హో.... నువ్వు నా ప్రాణం అని  విన్నవించు ఈ పాటనీ 
 ఎక్కడో దూరనున్నా చుక్కలే విన్నాగనీ  
కదిలించలేదా కాస్త కూడా నీ మనస్సునీ  
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమీ 
  అందరినీ ఇలా వెంటపడి అడగలా 
 సరదాగా నువ్వే ఎదురయితే సరిపోదా 
 నిద్దుర పోతున్నా రాతిరినడిగా 
 గూటికి చేరినా గువ్వాలనడిగా
  చల్లగాలినడిగా ఆ... చందమామనడిగా 
        ప్రియురాలి జాడ చెప్పారేమనీ.................

Ede Naa Palletooru

 

ఇదే నా పల్లెటూరూ  ఇదే నా తల్లిగారు

మా ఊరి పాడిపంట రాములోరి దీవెనంటా

తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మా పాదాలు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్  మనసంతా హాయ్ హాయ్ హాయ్

ఇదే నా పల్లెటూరూ   ఇదే నా తల్లిగారు

మా ఊరి పాడిపంట, రాములోరి దీవెనంటా

 

రామునికి బాణమొకటి భార్య సీతమ్మ ఒకటి

ఆ రాముడంటి కొడుకు ఇంటింటా ఉంటే ఒకడు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్  మనసంతా హాయ్ హాయ్ హాయ్

 

ఒకదేవుడే తనకు ఒక ధర్మమే తనది

హనుమంతుడే మనకు ఆదర్శమే అయితే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్  మనసంతా హాయ్ హాయ్ హాయ్

ఇదే నా పల్లెటూరూ   ఇదే నా తల్లిగారు

మా ఊరి పాడిపంట, రాములోరి దీవెనంటా

 

తొలకరిలో వానచుక్కా  రుచి చూస్తే తేనెచుక్కా

భూమి తల్లి మోముపైనా చిన్న గరిక నవ్వుతుంటే 

ఊరంతా హాయ్ హాయ్ హాయ్  మనసంతా హాయ్ హాయ్ హాయ్

 

ఆలమంద పాలధార మీటుతున్నదో సితారా

కడుపునిండా పాలు తాగి లేగదూడలాడుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్  మనసంతా హాయ్ హాయ్ హాయ్

 

ఇదే నా పల్లెటూరూ  ఇదే నా తల్లిగారు

మా ఊరి పాడిపంట రాములోరి దీవెనంటా

తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మా పాదాలు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్  మనసంతా హాయ్ హాయ్ హాయ్

 


 

 

 

 

 

 

 

Okate Jananam Okate Maranam

 

 out of the darkness came the light

all lights begin in the darkness

we are all moving towards the light

come step with one of us

in the journey of life

 

ఒనం ఒకటే మకటే జనరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందె వరకు 

అలుపు లేదు మనకు

బ్రతుకు అంటే గెలుపూ

గెలుపు కొరకే బ్రతుకు

కష్టాలు రాని కన్నీళ్లు రాని

ఎమైనా గానీ ఎదురేది రాని

ఓడిపోవద్దు రాజీపడొద్దు

నిద్ర నీకొద్దు నింగీ నీ హద్దు 

ఒనం ఒకటే మకటే జనరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందె వరకు 

అలుపు లేదు మనకు

బ్రతుకు అంటే గెలుపూ

గెలుపు కొరకే బ్రతుకు

 

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి

ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలి

నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా

ఎదనిండా చిరునవ్వే  చిరునామై ఉంటున్నా

నిన్నే వీడని నీడల్లే నీతో ఉంటా ఓ నేస్తం

నమ్మకమే మనకున్నా బలం

నీలి కళ్లల్లో మెరుపు మెరవాలి

కారుచీకట్లో దారి వెతకాలి

గాలివానల్లో ఉరుమై సాగాలి

తగిలే గాయాల్లో గేయం చూడాలి

ఒనం ఒకటే మకటే జనరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందె వరకు 

అలుపు లేదు మనకు

బ్రతుకు అంటే గెలుపూ

గెలుపు కొరకే బ్రతుకు

 

నిదరోకా నిలుచుంట , వెన్నెలలో చెట్టువలె

నీకోసం వేచుంటా,  కన్నీటి బొట్టువలే 

 

అడగడుగు నీ గుండె గడియారం నేనవుతా

నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా

రాసిన పోసిన కలలన్నీ దోసిలి నిండి నింపిస్తా

చేతులు చాచిన స్నేహంలా

ఒనం ఒకటే మకటే జనరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందే వరకు 

అలుపు లేదు మనకు

బ్రతుకు అంటే గెలుపూ

గెలుపు కొరకే బ్రతుకు

 


 

 

 

 

 

Friday, 29 October 2021

Ninu Vidisivundalenaya

 

నినువిడిసి యుండలేనయా

నినువిడిసి యుండలేనయా

కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా

 

నిన్నువిడిసి యుండలేను కన్నతండ్రి వగుట చేత

నిన్నువిడిసి యుండలేను కన్నాతండ్రి వగుట చేత

ఎన్నబోకు నేరములను సిన్నికుమారుడనయా శివా 

నిన్ను విడిసి యుండలేను కన్నతండ్రి వగుట చేత

ఎన్నబోకు నేరములను సిన్నికుమారుడనయా శివా

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

 

నిన్ను విడిసి యుండలేను కన్నతండ్రి వగుట చేత 

నిన్ను విడిసి యుండలేను కన్నాతండ్రి వగుట చేత 

ఎన్నబోకు నేరములను సిన్నికుమారుడనయా శివా

నిన్ను విడిసి యుండలేను కన్నతండ్రి వగుట చేత 

ఎన్నబోకు నేరములను సిన్నికుమారుడనయా శివా

ఎన్నబోకు నేరములను సిన్నికుమారుడనయా శివా  

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా 

 

సర్వములకు కర్త నీవు సర్వములకు భోక్త నీవు 

సర్వములకు కర్త నీవు సర్వములకు భోక్త నీవు

సర్వములకు ఆర్తా నీవు  పరమపురుష భవహరా

సర్వములకు కర్త నీవు సర్వములకు భోక్త నీవు

సర్వములకు ఆర్తా నీవు  పరమపురుష భవహరా

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా 


వరదపద్మ ఫాలశంబో ...శంబో

 వరదపద్మ ఫాలశంబో బిరుదులన్నీ గలవు నీకు

వరదపద్మ ఫాలశంబో బిరుదులన్నీ గలవు నీకు

కరుణతోడి బ్రోవకున్న బిరుదులన్నీ సున్నారన్నా

కరుణతోడి బ్రోవకున్న బిరుదులన్నీ సున్నారన్నా

వరదపద్మ ఫాలశంబో బిరుదులన్నీ గలవు నీకు

కరుణతోడి బ్రోవకున్న బిరుదులన్నీ సున్నారన్నా

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా మహదేవ శంభో

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నిను విడిసి యుండలేనయా


శివమహాదేవ శంకరా నీవే తోడు నీడ మాకు

శివమహాదేవ శంకరా నీవే తోడు నీడ మాకు

కావుమయ్య శరణు శరణు దేవ దేవ సాంబశివ

కావుమయ్య శరణు శరణు దేవ దేవ సాంబశివ 

 శివా శివమహాదేవ శంకరా నీవే తోడు నీడ మాకు

కావుమయ్య శరణు శరణు దేవ దేవ సాంబశివ

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నినువిడిసి యుండలేనయా మహదేవ శంభో

నినువిడిసి యుండలేనయా కైలాసవాసా

నిను విడిసి యుండలేనయా

 


 

 

 

  


 

 

 

 

 

 

  

 


 

 

Koduka Telugu Tatvalu Song

 

ప్రేమతో పిలిచినా పలకరించినా నన్ను

బతికి ఉన్నప్పుడే కొడకా

ప్రేమతో పిలిచినా పలకరించినా నన్ను

బతికి ఉన్నప్పుడే కొడకా 

కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచినా లాభమేముంది కొడకా

నీవు కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమేముంది కొడకా

పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా

పట్టెడన్నము గాని పచ్చడన్నము గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా

పోయాక పెట్టేవి పంచభక్ష్యాలన్నీకాకి పాలే కదా కొడకా

వారు పోయాక పెట్టేవి పంచభక్ష్యాలన్నీ కాకి పాలే కదా కొడకా

తల్లి పోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు 

తల్లి పోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు 

ఆస్తులైనా అన్ని అంతస్తులైనా మున్నాళ్ల ముచ్చటే కొడకా

తల్లికి తండ్రికి వృద్దాప్యంలో కుడి భుజమై నిలవాలి కొడకా

నీవు తల్లికి తండ్రికి వృద్దాప్యంలో కుడి భుజమై నిలవాలి కొడకా

పోయాక మోసేటి భుజాలెనున్న లాభమేమున్నాది కొడకా

పోయాక మోసేటి భుజాలెనున్న లాభమేమున్నాది కొడకా



   

 


 

Wednesday, 6 October 2021

Kodekaru Chinnavada

 

కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా

కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా

  కోటలోనా పాగావేసావా చల్ పూవులరంగా  

మాటతోనే మనసు దోచావా 

చల్ పూవులరంగా  మాటతోనే మనసు దోచావా

 

 చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా

 చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా

  కోరికలతో కోటే కట్టావా చల్ నవ్వుల రాణి 

 దోరవలపుల దోచుకున్నావా 

చల్ నవ్వుల రాణి  దోరవలపుల దోచుకున్నావా

 

  చెట్టుమీద పిట్ట ఉంది పిట్ట నోట పిలుపు ఉంది

  చెట్టుమీద పిట్ట ఉంది పిట్ట నోట పిలుపు ఉంది  

పిలుపు ఎవరికో తెలుసుకున్నావా చల్ పూవుల రంగా   

తెలుసుకుంటే కలిసి ఉంటావా

చల్ పూవుల రంగా   తెలుసుకుంటే కలిసి ఉంటావా

 

   పిలుపు విన్నా తెలుసుకున్నా పిల్లదానా నమ్ముకున్నా

పిలుపు విన్నా తెలుసుకున్నా పిల్లదానా నమ్ముకున్నా  

తెప్పలాగా తేలుతున్నానే చల్ నవ్వుల రాణి .. 

నాకు జోడుగా నావ నడిపేవా  

చల్ నవ్వుల రాణి  నాకు జోడుగా నావ నడిపేవా  

 

 నేలవదిలి నీరు వదిలి నేను నువ్వను తలపు మాని

నేలవదిలి నీరు వదిలి నేను నువ్వను తలపు మాని 

 ఇద్దరొకటై ఎగిరిపోదామా చల్ పూవులరంగా

 గాలి దారుల తేలి పోదామా చల్ పూవులరంగా

 గాలి దారుల తేలి పోదామా

 

 ఆడదాని మాటవింటే తేలిపోవటం తేలికంటే

ఆడదాని మాటవింటే తేలిపోవటం తేలికంటే  

తెల్సి తెల్సి ముంచుతారంట చల్ నవ్వులరాణీ 

మునుగుతుంటే నవ్వుతారంట  చల్ నవ్వులరాణీ 

మునుగుతుంటే నవ్వుతారంట

 

కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా

  కోటలోనా పాగావేసావా చల్ పూవులరంగా  

మాటతోనే మనసు దోచావా 

                 చల్ పూవులరంగా  మాటతోనే మనసు దోచావా

 

చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా

  కోరికలతో కోటే కట్టావా చల్ నవ్వుల రాణి 

 దోరవలపుల దోచుకున్నావా 

చల్ నవ్వుల రాణి  దోరవలపుల దోచుకున్నావా


 

 

 

 

 

 


 

Shranam nee divya charanam

 

 

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

  శ్రీ శేషశైలవాసా

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

 శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం 

 

 

భక్తుల బ్రోచే స్వామివి నీవే

 పేదలపాలిటి పెన్నిధి నీవే  

భక్తుల బ్రోచే స్వామివి నీవేపేదలపాలిటి పెన్నిధి నీవే

 సకల జీవులను చల్లగ చూచే 

 సకల జీవులను చల్లగ చూచేకరుణామయుడవు నీవే

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

 శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం

 

 

  త్రేతాయుగమున శ్రీరాముడవై 

ద్వాపరమందున గోపాలుడవై

త్రేతాయుగమున శ్రీరాముడవై  ద్వాపరమందున గోపాలుడవై

  ఈ యుగమందున వెంకటపతివై 

ఈ యుగమందున వెంకటపతివై  భువిపై వెలసితివీవే

శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

 శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం

 

   నీ ఆలయమే శాంతికి నిలయం 

నిను సేవించే బ్రతుకే ధన్యం

నీ ఆలయమే శాంతికి నిలయం  నిను సేవించే బ్రతుకే ధన్యం

   తిరుమలవాసా శ్రీ వేంకటేశా

తిరుమలవాసా శ్రీ వేంకటేశా  మా ఇలవేలుపు నీవే 


శరణం నీ దివ్య చరణం  నీ నామమెంతొ మధురం

శ్రీ శేషశైలవాసా 

                              శరణం నీ దివ్య చరణం శ్రీ చరణం