ఇదే నా పల్లెటూరూ ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మా పాదాలు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్ మనసంతా హాయ్ హాయ్ హాయ్
ఇదే నా పల్లెటూరూ ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట, రాములోరి దీవెనంటా
రామునికి బాణమొకటి భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడుకు ఇంటింటా ఉంటే ఒకడు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్ మనసంతా హాయ్ హాయ్ హాయ్
ఒకదేవుడే తనకు ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే అయితే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్ మనసంతా హాయ్ హాయ్ హాయ్
ఇదే నా పల్లెటూరూ ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట, రాములోరి దీవెనంటా
తొలకరిలో వానచుక్కా రుచి చూస్తే తేనెచుక్కా
భూమి తల్లి మోముపైనా చిన్న గరిక నవ్వుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్ మనసంతా హాయ్ హాయ్ హాయ్
ఆలమంద పాలధార మీటుతున్నదో సితారా
కడుపునిండా పాలు తాగి లేగదూడలాడుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్ మనసంతా హాయ్ హాయ్ హాయ్
ఇదే నా పల్లెటూరూ ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మా పాదాలు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్ మనసంతా హాయ్ హాయ్ హాయ్
No comments:
Post a Comment