Wednesday, 17 August 2016

Eduta Neeve Edalona Neeve


ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే... అటు నీవే...మరుగైనా కావే 
ఎదుటా నీవే ఎదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం 
తెలిసి వలచుట తొలి నేరం..అందుకే ఈ గాయం /2/

గాయాన్నైనా  మాననీవు... హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు... మరణం నన్ను చేరనీదు
పిచ్చివాడ్ని కానీదు హ హ హ ఓహో హో హఓ ఉ హూ హూ  హూ

ఎదుట నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే... అటు నీవే...మరుగైనా కావే 
ఎదుటా నీవే ఎదలోనా నీవే

కలలకు భయపడిపోయాను..
నిదురకు  దూరం అయ్యాను
వేదన పడ్డానూ..

స్వప్నాలైతే క్షణికాలేగా,  సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత , సత్యం స్వప్నం అయ్యేదుందా
ప్రేమకింతా బలముందా హా హా హా ఓహొ హో హో ఉ హూ హూ  హూ

ఎదుట నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే... అటు నీవే...మరుగైనా కావే 
ఎదుటా నీవే ఎదలోనా నీవే


No comments:

Post a Comment