Wednesday, 17 August 2016

Premaledhani Premincharaadani




ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ...
ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ
ప్రేమ లేదనీ ప్రేమించరాదనీ
సాక్ష్యమే నీవనీ... నన్ను నేడు చాటనీ.. ఓ ప్రియా జోహారులూ
ప్రేమ లేదనీ, ప్రేమించరాదని..సాక్ష్యమే నీవనీ...
నన్ను నేడు చాటనీ... ఓ ప్రియా జోహారులూ


మనసు మాసిపోతే మనిషే కాదనీ..కటిక రాయికైన కన్నీురుందనీ..
వలపు చిచ్చు తగులుకుంటె ఆరిపోదనీ..
గడియపడిన మనసు తలుపు తట్టి చెప్పనీ...
ఉసురుకప్పి మూగబోయే నీ ఊపిరీ../2/
మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లల లాలా..

గురుతు చెరిపివేసి జీవించాలనీ..
చెరపలేకపోతే మరణించాలనీ..
తెలిసికూడా చెయ్యలేని వెర్రవాడనీ..
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ...
ముక్కలలో లెక్కలేని రూపాలలో..
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ..

ప్రేమ లేదనీ, ప్రేమించరాదని..ప్రేమ లేదనీ, ప్రేమించరాదనీ..
సాక్ష్యమే నీవని..నన్ను నేడు చాటనీ..ఓ ప్రియా జోహారులూ..
లాల  లాలలా లాలాల లాలల...



No comments:

Post a Comment