ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం../2/
చేసినాను ప్రేమ క్షీరసాగర మధనం..మింగినాను హాలహలం...
ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం..
ప్రేమించుటేనా.. నా దోషము..పూజించుటేనా నా పాపము..
ఎన్నాళ్ళనీ ఎదలో ముల్లు.. కన్నీరుగా ఈ కరిగే కళ్ళు
నాలోనీ నీ రూపమూ... నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం...
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం..
నే నోర్వలేనూ ఈ తేజము.. ఆర్పేయారాదా .. ఈ దీపము..
ఆ చీకటిలో కలిసేపోయి... నా రేపటిని మరిచేపోయి...
మానాలి నీ ధ్యానమూ.. కావాలి నే శూన్యము..
అప్పడాగాలి ఈ మూగ గానం..
ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం..
చేసినాను ప్రేమా క్షీరసాగర మధనం..మింగినాను హాలహలం...
ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత కఠినం..
No comments:
Post a Comment