Tuesday, 16 August 2016

Rang de




నలుపు తెలుపు నా కాటుక కళ్ళకీ
రంగు రంగు కలలిచ్చినదెవ్వరూ
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ
నిదుర మర్చినా రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరూ
బుగ్గ నలుపులో ఎరుపై వచ్చిందెవరూ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించూ నీ ఇష్టం

హే రంగ్ దే రే. రంగ్ దే రే
హే రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే రే
హే రంగ్ దే రే. రంగ్ దే రే 
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే 

రంగ్ దే రే. రంగ్ దే రే
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే
ఐదు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
మొత్తం రంగెయ్యొద్దు    పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకీ
మొత్తం రంగెయ్యొద్దు    నా మేని వంపులకీ
కొత్త రంగే దిక్కు కౌగిళ్లకీ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించూ నీ ఇష్టం

నీలి మేఘం నెమలి పింఛం
రెంటికి లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినేనాడు విడతీయలే

హే రంగ్ దే రే. రంగ్ దే రే
హే రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే రే
హే రంగ్ దే రే. రంగ్ దే రే 
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే

ఐదు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
మొత్తం రంగెయ్యొద్దు    పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకీ
మొత్తం రంగెయ్యొద్దు    నా మేని వంపులకీ
కొత్త రంగే దిక్కు కౌగిళ్లకీ

రామబాణం సీత ప్రాణం
జన్మలెన్నైనా నీతో ప్రయాణం
రాధా ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటే బృందావనం

హే రంగ్ దే రే. రంగ్ దే రే
హే రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే రే
హే రంగ్ దే రే. రంగ్ దే రే 
రంగ్ దే. రంగ్ దే. రంగ్ దే

ఐదు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
మొత్తం రంగెయ్యొద్దు    పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిక్కు నా కళ్ళకీ
మొత్తం రంగెయ్యొద్దు    నా మేని వంపులకీ
కొత్త రంగే దిక్కు కౌగిళ్లకీ












No comments:

Post a Comment