Tuesday, 16 August 2016

Yaa Yaa



హే రాములుగా... బుగ్గల వాడా బురుజు కోట
విప్పరారా కండలవాడా
రాజపేట లాకుల కాడా కలుసుకుంటా
గాజుల పేరు పట్టకరారా
అల్లా భక్షు  అత్తరు తెచ్చా
కొత్తపేట కోక రైక కట్టుకొచ్చా
రంగవెల్లె రైలుబండి రయ్ మంది
పెట్టె బేడా పట్టుకొచ్చా

నిద్దరచాలని బద్దకమల్లె వళ్ళిరించిందీ ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం
వెలుతురు మోస్తు దిగివస్తున్నది గాలిలో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికుడల్లే స్వాగతమంది పచ్చదనం

మౌనంగా ధ్యానంలో ఉంది.... మా గానం
చిట్టి వడ్రంగి పిట్టలాగా బిక్కు బిక్కు
బొమ్మ రంగాల్లో మైనాల కుహు కుహు
ఇది పల్లెకు తెలిసినా మెలోడిగా..

యా.. యా... యా.. యా..
యా యా యా యా /2/

అయ్య.... ముగ్గులు ముంగిల్లు
అయ్య.... ప్రేమలు నట్టిల్లు
అయ్య....చూడరా చాల్లే నా రెండు కళ్ళు
అయ్య...పవ్వులు పుప్పొడ్లూ
అయ్య....పంటలు నూర్పిడ్లు
అయ్య....పండగలు తిరణాల్లు
ఈ పచ్చగాలి జోలలు నచ్చనోళ్ళు లేరటా

కళ్ళాపి జల్లి రాయండే రంగమ్మ
కవ్వాలే తిప్పాలి కానీవే గంగమ్మ
మావిళ్ళు పోయాలి కదమింత ఇయ్యమ్మా
పొద్దెక్కి పోతాన్ది ఇంక ఆలస్యమా

యా.. యా యా యా
యా యా యా యా
యా యా యా యా
యా  యా యా యా

గోపాల గోపాల అలకేలరా
నీ పాట వేళాయే అగుపించరా
గోపాల గోపాల అలకేలరా
చీకటి వేళకి నీ పంచనా
చేరని మనసిది క్షమించునా
నిన్నటి మొన్నటి రోషములెరుగను
చల్లాట చాలించరా
అల్లరి చేష్టల దండించనా
అక్కునచేర్చి లాలించనా
నెమ్మది చెదిరినా అమ్మని చూడరా
బిరగా రా రాదు రా...

గోపాల గోపాల 
గోపాల గోపాల
అలకేలరా
దీపాల వేళాయే అగుపించరా....



No comments:

Post a Comment